Rajamouli: రాజమౌళి ఎవరి దగ్గర అసిస్టెంట్ గా చేశాడో డిటైల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.!

దర్శకుడు రాజమౌళి ఇండియాలోనే అతిపెద్ద దర్శకుడిగా అవతరించాడు. కెరీర్లో ప్లాప్ అనేది లేకపోవడం ఈ దర్శకుడి ప్రత్యేకత. ఇక ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు. బాహుబలి మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో విదేశాల్లో కూడా భారీ వసూళ్లు రాబట్టారు. అమెరికా, జపాన్ దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ ఊహించిన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలవడంతో ఆయన కీర్తి ఎల్లలు దాటిపోయింది.

దర్శకుడు కీరవాణి స్వరపరచిన నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. దేశం మొత్తం ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంతటి కీర్తి సొంతం చేసుకున్న రాజమౌళి దివంగత నటుడు వేణు మాధవ్ కి అసిస్టెంట్ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఏంటి రాజమౌళి కమెడియన్ వేణు మాధవ్ అసిస్టెంటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ అది నిజం. అయితే నిజ జీవితంలో కాదు. ఓ మూవీలో రాజమౌళి వేణు మాధవ్ అసిస్టెంట్ గా చేశాడు.

2004లో రాజమౌళి (Rajamouli) దర్శకుడిగా మూడో చిత్రం సై చేశాడు. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది. కమెడియన్ వేణు ఓ చిన్న పాత్ర చేశాడు. నల్లబాలు నాకి చంపేస్తా అంటూ వేణు మాధవ్ చెప్పిన డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్. సై చిత్రంలో రాజమౌళి వేణు మాధవ్ కి అసిస్టెంట్ గా చిన్న క్యామియో పాత్రలో మెరిశారు. అదన్నమాట సంగతి. రాజమౌళి మంచి నటుడు కూడాను. తన మూవీలోని ప్రతి సన్నివేశం నటులకు నటించి చూపిస్తాడట.

అలాగే ఆయనకు చిన్న చిన్న పాత్రలు చేయడానికి ఇష్టపడతారు. సై, రైన్ బో, మగధీర, ఈగ, బాహుబలితో పాటు పలు చిత్రాల్లో రాజమౌళి నటించాడు. ప్రస్తుతం రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇది జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అంటూ ఇప్పటికే వెల్లడించారు. రాజమౌళి గత చిత్రాలకంటే భారీ స్థాయిలో తెరకెక్కనుంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus