సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరక్టర్, స్టార్ హీరో, యంగ్ హీరో, యువ దర్శకుడు.. ఇలా ఎవరికైనా తొలి రోజులు కాస్త చేదుగానే ఉంటాయి. కెరీర్‌లో ఓ స్థాయికి వచ్చాక వాటిని తలచుకోని వారు ఉండరు. ఎందుకంటే వారి స్ట్రగుల్సే వారిని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. వాళ్లకు అనేకాదు ఎవరికైనా అంతే. అయితే వాళ్లు బెస్ట్ పొజిషన్‌కి వెళ్లినప్పుడు వాటి గురించి అందరికీ ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు అలా బెస్ట్ అనిపించుకుని.. తన గతం గురించి మన ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు సందీప్ రాజ్.
జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రం (తెలుగు)గా 2020కిగాను నిలిచిన ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్‌రాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఏమైందో చెప్పారు. దీంతో ఆ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో, టాలీవుడ్‌లో చర్చగా సాగుతున్నాయి. సందీప్ రాజ్ షార్ట్‌ఫిల్మ్ ‘ది అతిథి’ హిట్టయ్యాక మెల్లమెల్లగా అవకాశాలు రావటం మొదలయ్యాయట. ఈ క్రమంలో సందీప్ రాజ్‌కి ఒక అసిస్టెంట్ రైటర్ ఒక స్క్రిప్టు ఇచ్చి డెవలప్ చేయమన్నారట.
సరిగ్గా ఆ సమయంలోనే సందీప్ రాజ్ కాస్త ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉన్నారట. దీంతోపాటు ఎంత రెమ్యూనరేషన్ అడగాలో కూడా ఆయన తెలియదట. ఆ సమయంలో ఆయనకు రూ. అయిదువేలు అవసరమై అంతే అడిగారట. దానికి ఆ అసిస్టెంట్ రైటర్ ఓ నవ్వు నవ్వి రూ. అయిదు వేలేంటి? నీకెంత కావాలంటే అంత తీసుకో అన్నారట. స్క్రిప్టు పని పూర్తయ్యాక సందీప్ రాజ్ నెంబరును అతను బ్లాక్ చేశాడట. అయితే అంత తక్కువ డబ్బులు అడగడమే బ్లాక్ చేయడానికి కారణమని తరువాత తెలిసిందట.
దాంతో ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనే విషయం అప్పుడు అర్థమయ్యింది అని చెప్పారు సందీప్ రాజ్. ఆ తర్వాత ‘కలర్‌ఫోటో’ కథను చర్చించేటప్పుడు జీవితం గురించ, కెరీర్ గురించి ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాను అని అన్నారు సందీప్ రాజ్. కరోనా పరిస్థితుల కారణంగా ఓటీటీలో వచ్చిన ‘కలర్ ఫోటో’ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు అవార్డు కూడా వచ్చింది.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?