రూటు మారుస్తున్న దర్శకుడు సతీష్ వేగేశ్న..?

‘శతమానం భవతి’ ‘శ్రీనివాస కళ్యాణం’ ‘ఎంత మంచివాడవురా’ వంటి చిత్రాలను తెరకెక్కించి కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. వీటిలో ‘శతమానం భవతి’ చిత్రమైతే బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా.. నేషనల్ అవార్డుని సైతం సొంతం చేసుకుంది.తాను తెరకెక్కించే సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయినప్పటికీ ఓ చక్కటి మెసేజ్ ను కూడా ఇస్తుంటాడు ఈ దర్శకుడు. ఇదిలా ఉండగా.. వరుసగా మూడు సినిమాలు ఓకే జోనర్లో చెయ్యడం వల్ల..

ఈ దర్శకుడికి బోర్ కొట్టేసిందేమో.! ఈసారి రూటు మార్చబోతున్నాడని టాక్ బలంగా వినిపిస్తుంది.అది కూడా ఒక విధంగా మంచిదే..! ఎందుకంటే.. ఒకే జోనర్లో సినిమాలు చేస్తే.. క్రేజ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఈసారి యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాలి అని ప్లాన్ చేస్తున్నాడట ఈ ఫ్యామిలీ డైరెక్టర్. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు సతీష్ వేగేశ్న తన కొడుకు సమీర్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

Director Satish Vegesna says no to family movies1

ఇది పక్కా యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో.. అలాగే కామెడీ తో కలగలిపి ఉండబోతుందట. అలా అని తన మార్క్ ఫ్యామిలీ సీన్స్ మాత్రం మిస్ అవ్వవని కూడా తెలుస్తుంది. ఆయన కొడుకు సమీర్ తో పాటు ఈ చిత్రంలో మరో యువ హీరో కూడా ఉంటాడని ఇన్సైడ్ టాక్. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు.. నటీ నటుల వివరాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నాడని సమాచారం.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus