Bharateeyudu 2: ‘భారతీయుడు 2’ లో కమల్ పాత్ర వయసు లాజిక్ పై శంకర్ స్పందన.!

  • July 10, 2024 / 12:30 PM IST

కమల్ హాసన్ (Kamal Haasan)  – శంకర్ (Shankar)  కాంబినేషన్లో ‘భారతీయుడు’ (‘ఇండియన్’) అనే సినిమా వచ్చింది. 1996 లో అంటే 28 ఏళ్ళ క్రితం ఈ సినిమా వచ్చింది. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో ‘భారతీయుడు’ ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఓ వృద్ధుడు .. అదీ 75 ఏళ్ళ వయసులో అవినీతితో పోరాడటం అనేది.. ప్రేక్షకులకి చాలా కన్విన్సింగ్ గా దర్శకుడు శంకర్ చెప్పాడు.

అయితే ఇప్పుడు అంటే 28 ఏళ్ళ తర్వాత ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) వస్తుంది. జూలై 12 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇది ‘భారతీయుడు’ కి కొనసాగింపుగా రూపొందింది అని ట్రైలర్ స్పష్టం చేసింది. అయితే ఇక్కడే లాజిక్ కి పనిచెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 1996 టైంకి సేనాపతి పాత్ర వయసు 75 ఏళ్ళు అయితే.. ఇప్పుడు 103 ఏళ్ళు అవుతుంది. అలాంటప్పుడు సేనాపతి పాత్ర ఫైట్లు వంటివి ఎలా చేయగలుగుతుంది అనేది పెద్ద లాజికల్ ప్రశ్న? దీనికి శంకర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

‘భారతీయుడు’ చేసేటప్పుడు నాకు సీక్వెల్ ఆలోచన లేదు. ఆ సినిమాలో పోలీసులు దర్యాప్తులో భాగంగా సేనాపతి పుట్టిన సంవత్సరం, వయసు రివీల్ అవుతుంది. అందుకే పార్ట్ 2 లో సేనాపతిని చైనాలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా చూపించాను. అక్కడ వందేళ్లు నిండిన వాళ్ళు కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతారు. గాల్లో ఎగురుతూ కిక్ చేయగలరు కూడా..! అందుకే సేనాపతిని సూపర్ హీరోగా భావించి ప్రేక్షకులు థియేటర్ కి వెళ్ళాలి’ అంటూ శంకర్ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus