ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar) – రామ్‌చరణ్ (Ram Charan) తన కాంబినేషన్‌లో చాలా ఏళ్లుగా తెరకెక్కిన సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) . ఫైనల్లీ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు(Dil Raju) . ఈ క్రమంలో చరిత్రలో తొలిసారిగా ఇండియన్ సినిమాకు విదేశాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అక్కడ దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డల్లాస్‌లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శంకర్ మాట్లాడుతూ పలువురు తెలుగు హీరోలతో సినిమా చేద్దామనుకున్నా కుదర్లేదని..
‘గేమ్ ఛేంజర్’ రూపంలో రామ్ చరణ్‌తో సినిమా సెట్ అయింది అని చెప్పుకొచ్చారు శంకర్. ‘గేమ్ ఛేంజర్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నానని, ఇక్కడకు రావాలా వద్దా అని ఆలోచించాను అని చెప్పారు. అయితే మీ అందరి ఎనర్జీ చూసేందుకు వచ్చా అని అన్నారు. ‘పోకిరి’ (Pokiri) , ‘ఒక్కడు’ (Okkadu) లాంటి సినిమా చేయాలని అనుకున్నానని, అయితే అందులోనూ నా మార్క్ ఉండాలని కోరుకున్నానని చెప్పారు శంకర్. అలాంటి ఆలోచనలతో వచ్చిందే ‘గేమ్ ఛేంజర్’ సినిమా అని చెప్పారు.
తాను తమిళంలో, హిందీలో సినిమాలు చేశానని, తెలుగులో ఇప్పటికి కుదిరించి అని చెప్పారు. గతంలో చిరంజీవితో (Chiranjeevi) సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించానని, అది వర్కౌట్ కాలేదని చెప్పారు. అక్కడికి కొన్ని రోజులకు మహేశ్ బాబుతో (Mahesh Babu) సినిమా చేయాలనుకున్నాని, ప్రభాస్‌తో (Prabhas) కరోనా సమయంలో ఓ సినిమా కోం చర్చలు జరిగాయని చెప్పారు. అవేవీ కార్యరూపం దాల్చలేదని, రామ్ చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉంది కాబట్టి ఇప్పటికి అయింది అని చెప్పారాయన.
ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడి మధ్య ఘర్షణ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ప్లాట్ చెప్పుకొచ్చారు ఆయన. ఇక సినిమాల్లో అప్పన్న పాత్రలో రామ్‌చరణ్ నటన అద్భుతంగా ఉంటుందని చెబుతూ మరోసారి చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ గురించి మాట్లాడారు శంకర్. పాటల్లో చరణ్ డ్యాన్స్‌లు కూడా అదిరిపోయాయి అని శంకర్ చెప్పారు.