Shankar: ఒక్క ఫోటోతో రూమర్లకు చెక్ పెట్టిన శంకర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన తర్వాత తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఫాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కొంతకాలం పాటు శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంది అయితే భారతీయుడు 2 సినిమా షూటింగ్ పనులు తిరిగి ప్రారంభం కావడంతో శంకర్ ఈ సినిమా పనులలో బిజీ అవడం వల్ల చరణ్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నప్పటికీ సినిమా షూటింగ్ ఉండటంతో ఈ సినిమాలోని కొన్ని యాక్షన్స్ సన్ని వేషాలను మరొక డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. హిట్ సిరీస్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా యాక్షన్స్ సన్ని వేషాలు చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి..

ఈ విధంగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మెగా అభిమానులు ఈ విషయం పట్ల కాస్త అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలను డైరెక్టర్ శంకర్ పూర్తిగా ఖండించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేస్తూ గేమ్ ఛేంజర్ సినిమా గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు.

తాను గేమ్ ఛేంజర్ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నానని ఒక ఫోటోని ఈయన షేర్ చేశారు. దీంతో ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు అంటూ వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తవమని తేలిపోయిన దీంతో మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన చరణ్ తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus