విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ 1 న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ ,హిందీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. ఇక ‘ఖుషి’ గురించి అతను చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
ప్ర) ‘ఖుషి’ ట్రైలర్ చాలా వరకు ‘సఖి’ సినిమాలా ఉంది అంటూ కామెంట్లు చేశారు..ఎలా అనిపించింది?
శివ నిర్వాణ : ‘సఖి’ లాంటి పాయింట్ అనే వార్తలు నేను కూడా విన్నాను. కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది.
ప్ర) ‘మైత్రి’ మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన ‘అంటే సుందరానికీ!’ ఛాయలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు?
శివ నిర్వాణ : సెప్టెంబర్ 1న సినిమా చూడండి..! మీకు అలా అనిపిస్తే నాకు చెప్పండి. ఒకే కథ అయితే నిర్మాతలు ఎలా ఒప్పుకుంటారు(నవ్వుతూ)
ప్ర) ‘నా రోజా నువ్వే’ అనే పాటలో మణిరత్నం గారి సినిమా పేర్లు ఉంటాయి. ఈ పాట పాపులర్ అయ్యాక మణిరత్నం గారి నుండి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా?
శివ నిర్వాణ : నాకు తెలిసిన వాళ్ళు ఆయన వద్ద ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే.. ‘ఈ పాట చాలా బాగుంది’ అని ఆయన అన్నారట. అలాగే ప్రౌడ్ గా ఫీలయ్యారట. అది చాలు మనకి..!(నవ్వుతూ)
ప్ర) మీ సినిమాల్లో ఎక్కువగా మణిరత్నం గారి పోలికలు కనిపిస్తాయి?
శివ నిర్వాణ : ‘నిన్ను కోరి’ మీకు అలా అనిపించిందా? లేదు కదా..! ఇదీ అంతే..! అయినా నా సినిమాల్లో పెళ్లి తర్వాత జరిగే కథలే ఉన్నాయి.
ప్ర) మీ గత సినిమాలకు ‘ఖుషి’ కి వ్యత్యాసం ఏమైనా ఉంటుందా?
శివ నిర్వాణ : ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ సినిమాల్లో ఫెయిల్యూర్ లవ్ స్టోరీలను చూపించాను. ‘ఖుషి’ అనేది క్యూట్ లవ్ స్టోరీ. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.
ప్ర) ‘ఖుషి’ లో హీరోయిన్ భర్తతో గొడవ పడే సన్నివేశాలు ఉన్నాయి. ఇది సమంత గారి పర్సనల్ లైఫ్ కి దగ్గరగా ఉండే కథ అనుకోవచ్చా?
శివ నిర్వాణ : అస్సలు కాదు..! ఇది నేను ‘మజిలీ’ టైంలో రాసుకున్న కథ. ‘ఏమాయ చేసావె’ సినిమాలో సమంతగారిలో ఉండే క్యూట్ నెస్ ను మిస్ అయ్యాం… దానిని మళ్ళీ చూపించాలి అనే తాపత్రయంతో చేసిన సినిమా ఇది.
ప్ర) విజయ్ దేవరకొండతో పనిచేయడం ఎలా అనిపించింది?
శివ నిర్వాణ : విజయ్ కి చాలా నచ్చిన కథ ఇది. ‘లైగర్’ తో అతను పాన్ ఇండియా మూవీ చేశాడు. సమంత గారికి కూడా పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. ఈ సినిమాలో విజయ్ చాలా అందంగా కనిపిస్తాడు. అమ్మాయిలకి ముద్దొచ్చేస్తూ ఉంటాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి అతను ఇంకా దగ్గరవుతాడు అనుకోవచ్చు..!
ప్ర) మీ గత సినిమాలు ‘మజిలీ’ ‘టక్ జగదీష్’ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో మార్పులు జరిగాయి? మ్యూజిక్ డైరెక్టర్స్ పై మీ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చా?
శివ నిర్వాణ : అదేమీ కాదండి..! ‘మజిలీ’ రిలీజ్ టైంలో గోపి సుందర్ గారికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. దీంతో తమన్ గారిని తీసుకోవడం జరిగింది. అలాగే ‘టక్ జగదీష్’ విషయంలో తమన్ సాంగ్స్ కంపోజ్ చేశారు. రిలీజ్ టైంకి ఆయన పెద్ద సినిమాల వల్ల బిజీగా ఉండటంతో గోపీ సుందర్ గారు ఆర్.ఆర్ చేశారు.
ప్ర) ‘ఖుషి’ పాటలు పెద్ద హిట్ అయ్యాయి. మ్యూజిక్ గురించి చెప్పండి..!
శివ నిర్వాణ : ‘హృదయం’ లో దర్శన సాంగ్ నా ఫేవరెట్. అది విన్నాక నా కథకి ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే బెటర్ అనిపించింది. అందుకే ఆయన్ని సంప్రదించి ఫైనల్ చేశాం.
ప్ర) మీ ‘టక్ జగదీష్’ రిజల్ట్ తో సంతృప్తిగా ఉన్నారా?
శివ నిర్వాణ : సంతృప్తిగానే ఉన్నాను..! ఎందుకంటే అది నిర్మాతలకి లాభాలను అందించింది. అయితే థియేట్రికల్ రిలీజ్ అవుతుంది అని నేను ఆ సినిమాలో పెట్టిన కొన్ని పోర్షన్స్.. ఓటీటీ రిలీజ్ కావడం వల్ల కొంతమంది ప్రేక్షకులకి నచ్చలేదు. దాదాపు నా సినిమాలన్నీ నిర్మాతలకు లాభాలనే అందించాయి.
ప్ర) నిర్మాతలు ‘మైత్రి’ వారి గురించి చెప్పండి?
శివ నిర్వాణ : నేను ‘ఖుషి’ కోసం చిన్న సెట్ వేయిస్తే.. ఇంకా పెద్ద సెట్ వేయించొచ్చు కదా అని అడిగేవారు. వాళ్లకి సినిమా అంటే అంత ఇష్టం.
ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా లవ్ స్టోరీనా?
శివ నిర్వాణ : లేదు..! ఈసారి కొత్త జోనర్ అనుకుంటున్నాను. ‘ఖుషి’ రిలీజ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెబుతాను.