Upasana: మీరు వద్దనుకుంటే మాత్రం పాపులేషన్ తగ్గుతుందా?

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గాబాధ్యతలు తీసుకున్న ఉపాసన ఒకవైపు తన బిజినెస్ వ్యవహారాలను మరోవైపు మెగా కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. కోడలిగా మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతున్న ఉపాసన పిల్లల విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు.వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ వీరిద్దరూ పిల్లల గురించి ఆలోచించకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే ఎంతోమంది ఎన్నోసార్లు ఉపాసనను పిల్లల గురించి ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్న అడిగిన ప్రతిసారి ఆమె సరైన సమయంలోనే సమాధానం చెబుతా అంటూ ఆ ప్రశ్నను దాటవేశారు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం సద్గురును ఈమె పిల్లల గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. నేను ఎందుకు పిల్లలను వద్దనుకుంటున్నాననే విషయాన్ని సద్గురు ద్వారా తెలియజేశారు.ఈ క్రమంలోనే సద్గురు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పిల్లలు అవసరం లేదని అలా పిల్లలు వద్దనుకున్న వారికి తనకు బహుమానం ఇస్తానని సమాధానం చెప్పారు.

ఉపాసన సద్గురు ద్వారా పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసమే తాను పిల్లలను వద్దనుకుంటున్నానని చెప్పే ప్రయత్నం చేశారని వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈ వార్తలపై ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ స్పందించారు. ఈ విషయంలో ఉపాసన తీరుపై ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో రోజురోజుకు ఎంతో పాపులేషన్ పెరుగుతుంది అయితే మీ ఇద్దరు పిల్లల్ని కనక పోవడం వల్ల పాపులేషన్ ఏమాత్రం తగ్గదు అంటూ ఈయన మండిపడ్డారు. ఇకపోతే ప్రస్తుత కాలంలో బతుకు తెరువు కష్టమైనవారు కూడా తమ ఇంటికి వారసుడు కావాలని కోరుకుంటారు.

అలాంటిది వేల కోట్ల ఆస్తి ఉన్నటువంటి మెగా కుటుంబానికి వారసుడు లేకపోతే ఎలా? అని గీతా కృష్ణ ఉపాసన వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే సద్గురు చెప్పిన వ్యాఖ్యలు అనంతరం ఉపాసన పోస్ట్ చేస్తూ తాను ఇచ్చే బహుమానం తీసుకోవడానికి తన కుటుంబ సభ్యులు సిద్ధంగా లేరని పోస్ట్ చేశారు. అయితే ఈమె తన ఆలోచన విధానాన్ని మార్చుకొని పిల్లలను కనడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఈ విషయంలో ఉపాసన శుభవార్త ఎప్పుడు చెబుతారా అంటూ మెగా అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు .

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus