Shree Karthick, Allu Arjun: ఆ సినిమా కోసం ఐదేళ్లు ఆగడానికైనా ఓకే: శ్రీ కార్తిక్‌

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్‌ లైన్‌ ఏంటి? చాలా రోజులుగా ఈ ప్రశ్న వినిపిస్తున్నా.. ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఎవరెవరో కథలు చెప్పారని, బన్నీ వేరే దర్శకులను కలిశారని వార్తలు వస్తున్నా ఎక్కడా క్లారిటీ రావడం లేదు. అయినా ఇప్పుడెందుకు బన్నీ లైనప్‌ గురించి అనుకుంటున్నారా? కారణం ఉంది? ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో అరంగేట్రంలోనే మంచి విజయం అందుకున్న శ్రీ కార్తిక్‌ నెక్స్ట్‌ సినిమా కోసం బన్నీ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు.

దానికి ఓ కారణం కూడా చెప్పారు. అందుకే ఈ చర్చ. ‘ఒకే ఒక జీవితం’ సినిమా లాంటి కాంప్లికేటడ్‌ స్క్రిప్ట్‌ను పక్కాగా తీసి మెప్పించారు కార్తిక్‌. దీంతో తర్వాతి సినిమా కోసం అడ్వాన్స్‌లు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి అని చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం రెండో సినిమాను బన్నీతోనే చేయాలని అనుకుంటున్నారు. దీనికి కారణం ఆయన ఇంటి మొత్తం అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అట. చెన్నైలో తెలుగు సినిమా అంటే అల్లు అర్జున్ సినిమానే.

అందుకే రెండో సినిమా ఆయనతోనే చేయాలని అనుకుంటున్నాడు. అయితే కాస్త ఆలస్యమవుతుంది అని అంటారా? దానికీ ఆయన రెడీనట. ఏకంగా ఐదేళ్లు ఆగమన్నా.. బన్నీతో సినిమా కోసం ఆగుతాను అంటున్నారు శ్రీ కార్తిక్‌. శ్రీ కార్తిక్‌ తల్లి తెలుగువారేనట. బీఎస్‌ఎన్‌లో అధికారిగా పనిచేశారట. ఆమెకు హైదరాబాద్‌ అంటే చాలా ఇష్టం. అలాంటి తెలుగు నాట మంచి విజయం అందుకోవడం ఆనందంగా ఉంది అని చెప్పారు శ్రీ కార్తిక్‌.

అంతేకాదు నా తదుపరి సినిమా తెలుగులోనే ఉంటుంది అని క్లారిటీ ఇచ్చేశారయన. ఈసారిభారీ స్థాయిలో థియేటర్‌ అనుభూతిని పంచే సినిమానే చేస్తాను అని కూడా చెప్పారు. కార్తిక్‌ దగ్గర ఓ ఫాంటసీ కథ ఉందట. దాంతోనే బన్నీతో సినిమా చేయాలని అనుకుంటున్నారట. మరి బన్నీ ఏమంటాడో చూడాలి. బన్నీతో చేద్దాం అనుకుంటున్న సినిమా రియలిజం ఫాంటసీ అట. మరి దాని సంగతేంటో చూడాలి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus