‘కన్నెపిట్టరో.. కన్ను కొట్టరో’.. ఈ సాంగ్..ని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోరు. ఇప్పుడు కూడా ఈ పాట పెడితే.. అందరిలోనూ ఓ జోష్ వస్తుంది, తెలియకుండానే మన చేతులు..కాళ్ళు ఊగుతాయి అనడంలో సందేహం లేదు. భువన చంద్ర రచన.. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గానం కలిసి ఈ పాటని చార్ట్ బస్టర్ గా నిలబెట్టాయి. రాజ్- కోటి..లు కొట్టిన ట్యూన్ కూడా అదరహో అనిపించేలా ఉంటుంది. ఈ పాటని కనుక ఇప్పటి సినిమాల్లో రీమిక్స్ చేసి పెడితే..
అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాస్తవానికి.. ఆ ప్రయత్నం కూడా జరిగింది. కానీ తెరపైకి ఈ పాటని మళ్ళీ తీసుకురాలేకపోయారు. ఇంతకీ విషయం ఏంటంటే… నాని (Nani), నాగార్జున (Nagarjuna) కాంబినేషన్లో ‘దేవ దాస్’ (Devadas) అనే సినిమా వచ్చింది. 2018 సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోయింది. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకుడు. ‘భలే మంచి రోజు’ (Bhale Manchi Roju) ‘శమంతకమణి’ (Shamanthakamani) వంటి క్రైమ్ కామెడీ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న శ్రీరామ్ ఆదిత్య ‘దేవ దాస్’ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు.
ఫలితం సంగతి ఎలా ఉన్నా.. ఈ సినిమాని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. నాగ్- నాని కాంబోలో వచ్చే సీన్స్ బాగుంటాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం ‘కన్నెపిట్టరో.. కన్ను కొట్టరో’ సాంగ్ ని రీమిక్స్ చేశారట. సెకండాఫ్ లో ఈ సాంగ్ రావాలట. నాని- నాగ్..లతో ఈ పాటకు స్టెప్పులు వేయించాలని శ్రీరామ్ ఆదిత్య అనుకున్నాడట. కానీ చివరికి ‘ఆ ఆలోచన మానుకున్నట్టు’.. తాజాగా ‘మనమే’ (Manamey) సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు.
శర్వానంద్ (Sharwanand) 35వ సినిమాగా రూపొందిన ‘మనమే’ టీజర్, ట్రైలర్స్ బాగున్నాయి. ‘కచ్చితంగా ఈ సినిమా బాగా ఆడుతుందని.. తనకు మంచి కమర్షియల్ సక్సెస్ ను అందిస్తుందని’ శ్రీరామ్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు హీరో శర్వానంద్ సైతం ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.