తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ కుటుంబం నుంచి బాలయ్య ఎన్టీఆర్ ఇద్దరు పెద్ద ఎత్తున పోటీతో సినిమాలు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అయినప్పటికీ బాలకృష్ణతో మాత్రం విభేదాలు ఉన్నాయనే వార్తలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందుకు అనుగుణంగానే బాలకృష్ణ వ్యవహార శైలి కూడా ఉండడంతో ఎన్టీఆర్ ఎదుగుదల బాలయ్యకు కష్టంగా మారిందని కూడా వార్తలు వచ్చాయి.
ఇకపోతే తాజాగా బాలయ్య సినిమాని దెబ్బ కొట్టడం కోసమే ఎన్టీఆర్ సినిమాని విడుదల చేశారని చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఒకే కుటుంబం నుంచి రెండు సినిమాలు విడుదల అయ్యి బాలయ్య సినిమాను డిజాస్టర్ చేశాయి అంటూ డైరెక్టర్ శ్రీ వాస్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం. తాజాగా రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈయన బాలయ్య హీరోగా దర్శకత్వం వహించిన డిక్టేటర్ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా శ్రీవాస్ (Sriwass) మాట్లాడుతూ డిక్టేటర్ సినిమాలో బాలయ్యను చాలా అందంగా చూపించామని అలాగే రియాలిటీ కి దగ్గరగా ఈ సినిమాని చేశామని తెలిపారు. ఈ సినిమా చాలా సక్సెస్ అవుతుందని, ఎన్నో అంచనాల నడుమ విడుదల చేశామని తెలిపారు. అయితే ఈ సినిమా విడుదల వరకు సోలోగానే వస్తుందని భావించాము. అయితే అదే సమయంలోనే ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాని కూడా విడుదల చేశారని ఆ సినిమా ప్రభావం డిక్టేటర్ పై చాలా చూపించిందని శ్రీవాస్ తెలియజేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ డిక్టేటర్ సినిమాను విడుదల చేయాలని భావించాము అయితే అనుకోకుండా జనవరి 13వ తేదీ నాన్నకు ప్రేమతో సినిమాని విడుదల చేయడంతో రెవెన్యూ విషయంలో డిక్టేటర్ మేము అనుకున్న స్థాయికి వెళ్లలేదని తెలిపారు. ఇక నాన్నకు ప్రేమతో సినిమా హిట్ అవడం డిక్టేటర్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణమైంది అంటూ ఈ సందర్భంగా శ్రీ వాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!