Sujeeth, OG Movie: సుజీత్‌ మీద పవన్‌కి అంత నమ్మకమా? ‘ఓజీ’కి అది కలిసొచ్చిందట!

ఓ అభిమాని.. తన అభిమాన హీరోతో సినిమా చేస్తే ఎలాంటి విజయం అందుకుంటుందో చెప్పాలంటే ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) , ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమాల గురించి చెబితే చాలు. ఆ సినిమాల దర్శకులు ఆ హీరోలకు వీరాభిమానులు. ఇప్పుడు అలాంటి కాంబినేషన్‌లో తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’ (OG) . పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) – సుజీత్‌ (Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా గురించి ఇటీవల సుజీత్‌ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఓజీ’ సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుందట.

పవన్‌ సినిమాల్లో జపాన్‌ సినిమాల ప్రభావం ఉంటుందని, పాటల్లోనో లేక సన్నివేశాల్లోనూ ఆ ఎఫెక్ట్‌ ఇన్నాళ్లూ కనిపించిందని చెప్పారు సుజీత్‌. ఆ సినిమాలు చూసేటప్పుడు అవకాశం వస్తే పవన్‌ కల్యాణ్‌ను జపాన్‌ నేపథ్యంలో చూపించాలనుకున్నానని, ‘ఓజీ’తో ఆ కల నెరవేరింది అని చెప్పుకొచ్చారు సుజీత్‌. మొదట సుజీత్‌ను రీమేక్‌ సినిమా కోసం పిలిచారట. అయితే పవన్‌ కల్యాణ్‌తో ఒరిజినల్‌ కథ చేయడంలో ఉన్న అనుభూతి, కిక్‌ వేరని అనుకునేవాడినని..

అనుకోకుండా ఆ రోజు వచ్చి అవకాశం వచ్చిందని సుజీత్‌ తెలిపారు. ఒక రోజు ‘కొత్త కథ ఏదైనా ఉందా?’ అని పవన్‌ అడిగారట. దీంతో తన దగ్గర ఉన్న లైన్‌ చెప్పగానే చేయడానికి అంగీకారం తెలిపారని సుజీత్‌ చెప్పారు. ఆ తర్వాత దానినే పూర్తి స్థాయిలో సిద్ధం చేసి సినిమా చేస్తున్నామన్నారు. సుజీత్‌ను పిలిచిన రీమేక్‌ ఏంటి అనేది ఆయన చెప్పకపోయినా అది ‘తెరి’ రీమేక్‌ గురించే అని అంటున్నారు.

అంటే పోలీసు సినిమా కోసం వచ్చి గ్యాంగ్‌స్టర్‌ సినిమా చేశారు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాను సెప్టెంబరు 27న విడుదల చేస్తామని ఇప్పటికే టీమ్‌ చెప్పేసింది. ఆ మేరకు త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తారు అని అంటున్నారు. అదెప్పుడు అని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus