‘ఓజి’ (They Call Him OG) సినిమాకి సీక్వెల్ ఉంటుందని ‘ఓజి 2’ పేరుతో వస్తుందని.. క్లైమాక్స్ లో క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఈ క్రమంలో సుజిత్ కొన్ని పెద్ద మీడియా సంస్థలకు చెందిన ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో భాగంగా కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అతనికి ఎదురయ్యాయి. ఇందులో ఒక ఆసక్తికర ప్రశ్న కూడా ఉంది.
అదేంటంటే సెకండ్ పార్ట్‌లో పవన్ కళ్యాణ్ తో పాటు అకీరా నందన్ కూడా నటించే అవకాశం ఉందా?’ అనేది ఆ ప్రశ్న. దానికి సుజిత్ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చాడు. అతను మాట్లాడుతూ.. “ఆ విషయం మీరు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే కరెక్ట్. అకీరాతో చేస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. ‘ఓజీ’ షూటింగ్ టైంలో కూడా అకీరా తరచూ సెట్స్‌కు వచ్చేవాడు. అతనిలో కూడా స్పార్క్ ఉంది.
అంతకు మించి నేను ఏమైనా చెబితే.. ఈ విషయం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది.ఇప్పుడైతే అందరం ‘ఓజీ’ హైప్ తో ఉన్నాం. ఫ్యాన్స్ తో కలిసి మేము కూడా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాం. ఈ మధుర క్షణాలు ముగిసిన తర్వాత ‘ఓజి 2’ సంగతి చూద్దాం” అతనూ చెప్పుకొచ్చాడు సుజిత్.
సుజిత్.. అడివి శేష్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే అడివి శేష్, అకీరా నందన్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. పలు ఇంటర్వ్యూల్లో అడివి శేష్ ఈ విషయం పై ఓపెన్ అయ్యాడు. సుజిత్ కి ‘ఓజి’ ప్రాజెక్టు సెట్ అవ్వడంతో అకీరా పాత్ర కూడా చాలా ఉందనేది ఇన్సైడ్ టాక్. అందులో కనుక నిజం ఉంటే.. ‘ఓజి 2’ లో కూడా అకీరా భాగమయ్యే అవకాశం లేకపోలేదు.