మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ సతీష్ కిలారు (Venkatesh Kilaru) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థపై నవీన్ ఎర్నేని (Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతం కంప్లీట్ అయ్యింది. 2026 మార్చి 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని కూడా ప్రకటించారు.
ఈ సినిమాపై రాంచరణ్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే దీని తర్వాత చరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో చరణ్ తన 17వ సినిమా చేస్తాడని చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ నడుస్తుంది. దీంతో చరణ్ మరో ప్రాజెక్టును సమాంతరంగా మొదలు పెట్టాలి అనే టాక్ కూడా నడుస్తోంది.
చరణ్ కి ‘యూవీ క్రియేషన్స్’ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ప్రొడక్షన్లో సినిమా చేయాలని చాలా కాలంగా ఆశపడుతున్నాడు. అనిల్ అనే నూతన దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్.. చరణ్ కి నచ్చింది. కానీ అది భారీ బడ్జెట్ సినిమా. ఎక్కువ టైం పడుతుంది. దీంతో ‘ఓజి’ దర్శకుడు సుజీత్ తో (Sujeeth) ఓ సినిమా చేయాలని చరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ అతని వద్ద చరణ్ కి సరిపడే ఓ యాక్షన్ స్క్రిప్ట్ ఉంది. ‘ఓజి’ (OG) రిజల్ట్ ను బట్టి చరణ్ ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది.