సినిమాల్లో రాణించాలంటే అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందులు పడాలి, ఎంత కష్టపడాలి అనేది కథలు కథలుగా వింటూనే ఉన్నాం. కొందరు దాన్ని క్యాస్టింగ్ కౌచ్ అంటారు, ఇంకొందరు కాంప్రమైజ్ అంటారు. పేరేదైనా సమస్య ఒక్కటే. ఈ సమస్యలను అధిగమించడానికి ఇండస్ట్రీలో రకరకాల బృందాలు ఏర్పాటు చేశారు. ఒక బృందాన్ని సీనియర్ యాక్టర్ ఝాన్సీ లీడ్ చేస్తుండగా, మరికొన్ని టీమ్స్ ను ఫిలిం ఛాంబర్ & ప్రొడ్యూసర్ కౌన్సిల్ లు లీడ్ చేస్తున్నాయి.
ఇంత మంది రక్షకులు ఉన్నప్పటికీ.. భక్షకులను మాత్రం ఎవరూ నిరోధించలేకపోతున్నారు. ఒకరి తర్వాత మరొకరు ఇండస్ట్రీలో “కాంప్రమైజ్” పేరున జరిగే అరాచకాలను బయటపెడుతూనే ఉన్నారు. మొన్నామధ్య బాలీవుడ్ హీరోయిన్లు ఫాతిమా సనా షేక్, ఆ తర్వాత సానియా మల్హోత్రా (Sanya Malhotra), వీళ్లందరికంటే ముందు రాధిక ఆప్టే (Radhika Apte) వంటి వారందరూ సెట్స్ మీద వాళ్లు ఎదుర్కొన్న Laiగిక వేధింపులు మరియు ఇన్ డైరెక్ట్ మెసేజులు వంటి వాటి గురించి చెబుతూనే వచ్చారు.
ఇక రీసెంట్ గా ఈ లిస్ట్ లో హీరోయిన్ సయామీ ఖేర్ (Saiyami Kher) కూడా చేరింది. ఆమె తెలుగులో చేసింది రెండు సినిమాలు. అయితే.. ఆఫర్ల కోసం ఆమెను కాంప్రమైజ్ అవ్వాలని చెప్పేవాడట ఆమె మేనేజర్. ఈ విషయాన్ని ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దాంతో సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామన్ అనే అభిప్రాయం వెల్లడైంది.
మరి ఈ టాక్ నుంచి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎలా బయటకు తెస్తారు అనేది ఝాన్సీ (Jhansi) లాంటి వాళ్ళకే తెలియాలి. ఇకపోతే.. సయామీ ఖేర్ కూడా ఏమీ నెగిటివ్ గా మాట్లాడలేదు. ఆమె చెప్పింది.. ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారు అనే. ఇది అందరూ ఒప్పుకోలేని నిజమైన నిజం.