వైరల్ అవుతున్న సుకుమార్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ పుట్టినరోజు ఈరోజు. దాంతో వరుస టాలీవుడ్ స్టార్స్ అందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. ఈ రోజుతో సుకుమార్ 51వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. రాంచరణ్ తో ‘రంగస్థలం’ అనే చిత్రాన్ని చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్…ప్ర‌స్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దాంతో బ‌న్నీ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా.. సుకుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

‘నా ఫ్రెండ్ మరియు డైరెక్టర్ అయిన సుకుమార్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్ష‌లు. మేమిద్ద‌రం క‌లిసి ఒకేసారి కెరీర్ ను మొదలుపెట్టాము. కానీ సుకుమార్ జ‌ర్నీ చాలా స్పెష‌ల్‌. అతను ఇంకా ఎన్నో మంచి సినిమాలు తెరకెక్కించాలి.హ్యాపీ బ‌ర్త్‌డే డార్లింగ్’ అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నాడు. ఇక మహేష్ బాబు కూడా సుకుమార్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇదిలా ఉండగా సుకుమార్.. తన బర్త్ డే ను ఇంట్లోనే జరుపుకున్నాడు.

తనకి అత్యంత సన్నిహితులైన వారు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.ఈ ఫొటోల్లో సుకుమార్ భార్య తబిత మరియు అతని పిల్లలు కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు.ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుకుమార్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus