Sukumar: సుకుమార్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న సుకుమార్ ఇటీవల పుష్ప సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సుకుమార్ కూడా ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ గా సరికొత్త క్రేజ్ ను అందుకున్నాడు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే నేడు సుకుమార్ బర్త్ డే కావడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు.

అయితే ఈ తరుణంలో సుకుమార్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నాడు. సుకుమార్ ఎంతో సపోర్ట్ గా ఉండే ఆయన భార్య తబితా సుకుమార్ ఒక సరికొత్త సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చారు. నా ప్రేమకు పుట్టిన రోజు శభాకాంక్షలు అంటూ ఆమె సోషల్ మీడియాలో పోటోలు పోస్ట్ చేస్తూ ప్రత్యేకంగా తన ప్రేమను చాటుకున్నారు. నేను రోజంతా విశ్వానికి చాలా థాంక్స్ చెప్పాలి, ప్రతిరోజూ మీ కోసం ఎంతో ఆనందిస్తాను.

మీ ప్రియమైన వారి జీవితాల్లోకి తీసుకువచ్చే మొత్తం ఆనందం ఈ రోజు. ఈ సంవత్సరం చాలా ఉత్తేజకరమైన విషయాలతో నిండి ఉంటుంది. లవ్ యు.. అంటూ ఈ ఏడాది కూడా మంచి బ్లెస్సింగ్స్ తో పాటు అడ్వెంచరస్ గా ఉండాలని తాబితా కోరుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో వివరణ ఇచ్చారు. ఇక సుకుమార్ కూతురు కొడుకు ఇద్దరు కూడా ఈ పుట్టిన రోజు వేడుకల్లో చాలా ఆనందంగా గడిపినట్లు తెలుస్తోంది. వారికి సంబంధించిన ఫోటోలను కూడా తబితా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

సుకుమార్ ఏదైనా సినిమా మొదలు పెడితే కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటాడు అనే చెప్పాలి. ఆ విషయంలో ఫ్యామిలీ సపోర్టు లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అయితే తన భార్య పిల్లలు తనను ఎల్లప్పుడూ అర్థం చేసుకొని చాలా సపోర్టింగ్ గా ఉంటారు అని సక్సెస్ మీట్ లో సుకుమార్ ఎమోషనల్ గా వివరించిన విషయం తెలిసిందే.

1

2

3

4

5

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus