టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్3 డైరెక్టర్లలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఒకరు. సుకుమార్ తన ప్రతిభతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోవడంతో ఎన్నో అవార్డ్ లను సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ సుకుమార్ తబిత దంపతుల కూతురు సుకృతి వేణి కాగా బాలనటిగా సుకృతి వేణి సత్తా చాటి బెస్ట్ డెబ్యూ చైల్డ్ యాక్టర్ గా దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారాన్ని అందుకున్నారు. గాంధీ తాత చెట్టు చిత్రంలోని నటనకు సుకృతికి ఈ అవార్డ్ వచ్చింది.
సుకుమార్ కూతురికి ప్రతిష్టాత్మక అవార్డ్ రావడంతో ఈ దర్శకుడి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. గాంధీ తాత చెట్టు చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, గోపీ టాకీస్ నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమాను పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడం జరిగింది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం అందుతోంది. పద్మావతి మల్లాది ఈ సినిమాను తెరకెక్కించగా పర్యావరణ పరిరక్షణ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
దాదా సాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా నిన్న ఢిల్లీలో 14వ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించడంతో పాటు అవార్డ్ లను అందజేశారు. సినిమాటోగ్రఫీ విభాగంలో మంగళవారం (Mangalavaaram) సినిమాకు అవార్డ్ దక్కగా మంత్ ఆఫ్ మధు (Month of Madhu) సినిమాకు నవీన్ చంద్రకు (Naveen Chandra) బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ దక్కింది. మరోవైపు సుకుమార్ కూతురు సుకృతి వేణి టాలెంట్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.
భవిష్యత్తులో సుకృతి వేణి నటిగా మరింత మంచి పేరును సొంతం చేసుకుంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప ది రూల్ మూవీ (Pushpa2) నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కాగా ఈ ఫస్ట్ సింగిల్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొంతమందికి మొదట ఈ సాంగ్ నచ్చకపోయినా నిదానంగా నచ్చుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.