Sukumar Family: దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫొటోస్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్ తాజాగా పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈయన పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ పనులన్నింటినీ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా ప్రారంభించారు.

ఇక పూజ కార్యక్రమాలను ఎంతో ఘనంగా ప్రారంభించిన సుకుమార్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ హాలిడే వెకేషన్ లో ఉన్నారు. ఇలా తన భార్య కూతురు కొడుకుతో కలిసి ఈయన దుబాయ్ అందాలను వీక్షిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే సుకుమార్ దుబాయ్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వెకేషన్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి రాగానే పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి హిట్ అందుకున్న సుకుమార్ పుష్ప 2 పై భారీ అంచనాలను పెంచేశారు. ఇప్పటికే ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడి ఈ సినిమా కోసం ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.

సుకుమార్ దుబాయ్ నుంచి రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇక పుష్ప2 సినిమాలో సాయి పల్లవి ఓ గిరిజన యువతి పాత్రలో ఓ పది నిమిషాల పాటు నటించబోతుందని సమాచారం వినబడుతుంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

1

2

3

4

5

6

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus