Director Sukumar: ‘పుష్ప’ టీం ఓకే సుకుమార్ ఇంకా కోలుకోలేదట..!

స్టార్ డైరెక్టర్ సుకుమార్ డెంగ్యూ భారిన పడినట్టు శనివారం నుండీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ కారణంగా ‘పుష్ష’ షూటింగ్ మళ్ళీ వాయిదా పడింది. సుకుమార్ మాత్రమే కాదు…’పుష్ప’ టీమ్ లో చాలా మందికి డెంగ్యూ ఫీవ‌ర్ వ‌చ్చినట్టు ఇన్సైడ్ టాక్.అయితే హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక.. అదృష్టం కొద్దీ దీని భారీ నుండీ తప్పించుకోగలిగారట.రీసెంట్ గా హైద‌రాబాద్ లో జరిగిన ఓ షెడ్యూల్ లో భాగంగా ‘పుష్ప’ షూటింగ్ ను డాగ్ హౌస్ లో… నిర్వహించారు.

ఈ క్రమంలోనే… చిత్ర‌బృందానికి డెంగ్యూ సోకినట్టు స్పష్టమవుతుంది. సరిగ్గా ఆరోజు షూటింగ్లో పాల్గొన్న వారికే డెంగ్యూ సోకినట్టు ‘పుష్ప’ టీం సభ్యుల అంచనా. అయితే సుకుమార్ తప్ప దీని భారిన పడిన వాళ్లంతా కోలుకోవడం గమనార్హం. సుకుమార్ కి ఇంకా జ్వ‌రం వ‌స్తూ… పోతూ ఉందని తెలుస్తుంది. దీనికి కారణాలు లేకపోలేదు..! సుకుమార్ కి ఇత‌ర సమ‌స్య‌లు కూడా ఉన్నాయట..! సుకుమార్ సన్నిహితుల సమాచారం ప్రకారం.. అతనికి న‌డుం నొప్పి ఎక్కువ‌గా వస్తుందట.

అందువల్ల కూర్చీలో కూడా ఆయన కూర్చోలేక‌పోతున్నాడని వినికిడి. ప్రస్తుతం సుకుమార్ ని అతని ఇంట్లోనే పెట్టి హోమియోప‌తి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారట కుటుంబసభ్యులు.ఇందుకు సమయం పడుతుంది. అయితే సైడ్ ఎఫెక్ట్ లు వంటివి ఉండవు కాబట్టి.. సుకుమార్ కుటుంబ సభ్యులు ఈ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ వంటి హీరోలు సుకుమార్ కు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నట్టు వినికిడి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus