ఎనర్జిటిక్ స్టార్ రామ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన జగడం సినిమా 2007 సంవత్సరంలో విడుదలై ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. జగడం మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాను అభిమానించే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమా పాటలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో యూత్ ను ఆ పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జగడం సినిమా విడుదలై 14 సంవత్సరాలు కావడంతో సుకుమార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ
జగడం సినిమాను తాను ఆర్య మూవీ కంటే ముందుగానే తెరకెక్కించాలని అనుకున్నానని కానీ ఆర్య సినిమాను మొదట తెరకెక్కించాల్సి వచ్చిందని అన్నారు. దేవదాసు సినిమాలో రామ్ యాక్టింగ్ చూసి స్రవంతి రవికిషోర్ ను కలిసి ఆయన అంగీకారంతో జగడం సినిమా షూటింగ్ మొదలుపెట్టానని సుకుమార్ చెప్పుకొచ్చారు. జగడం సినిమా షూటింగ్ సమయంలో రామ్ వయస్సు కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమేనని.. ఆ ఏజ్ లో సినిమాలో ఏ సన్నివేశం చెప్పినా చేయలేనని చెప్పకుండా చేసేవాడని సుకుమార్ అన్నారు.
కాయిన్ ను చేతితో తిప్పాలని చెబితే కేవలం పది నిమిషాల్లో రామ్ కాయిన్ ను తిప్పడం నేర్చుకున్నాడని సుకుమార్ అన్నారు. హీరో రామ్ ను అతని బ్రిలియన్స్ కాపాడుతోందంటూ సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రామ్ గొప్ప నటుడిగా ఎదుగుతాడని భావించానని అనుకున్న విధంగా రామ్ గొప్ప నటుడు అయ్యాడని సుకుమార్ తెలిపారు. అప్పట్లో సెన్సార్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల సినిమాలో కొన్ని సన్నివేశాలు కట్ అయ్యాయని.. సెన్సార్ కట్స్ లేకపోతే సినిమా మరింత బాగుండేదని సుకుమార్ అన్నారు.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!