Sukumar: వైరల్ అవుతున్న సుకుమార్ పోస్ట్.. కూతురిని మెచ్చుకుంటూ?

  • May 24, 2024 / 08:06 PM IST

స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) సినిమా నుంచి వరుస విజయాలను అందుకుంటున్నారు. ఒక సినిమాను మించి మరో సినిమా సక్సెస్ సాధించడం కూడా ఈ స్టార్ డైరెక్టర్ కు ఊహించని స్థాయిలో ప్లస్ అవుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పుష్ప ది రూల్ (Pushpa 2) మూవీ విడుదలైన తర్వాత చరణ్ (Ram Charan) సినిమాపై ఈ దర్శకుడు ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తోంది. పుష్ప ది రూల్ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కు అంచనాలకు మించి రెస్పాన్స్ రాగా ఈ నెలాఖరున ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా మెలోడీ సాంగ్ రిలీజ్ కానుందని అధికారిక ప్రకటన వచ్చింది.

దర్శకుడు సుకుమార్ శిష్యులు సైతం కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తూ ప్రశంసలు పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సుకుమార్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సైతం ప్రాధాన్యత ఇస్తారు. నా చిట్టితల్లిని చూస్తే గర్వంగా ఉందంటూ సుకుమార్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. కూతురి ప్రతిభను మెచ్చుకుంటూ సుకుమార్ ఈ కామెంట్లు చేయడం జరిగింది. కొన్నిరోజుల క్రితం సుకుమార్ కూతురు సుకృతివేణి గాంధీ తాత చెట్టు అనే చిత్రానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు.

అయితే సుకుమార్ కూతురు గాయనిగా కూడా రాణిస్తుండటం గమనార్హం. ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లో సుకృతి వేణి పాట పాడిన వీడియోను సుకుమార్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఈ కామెంట్లు చేశారు. సుకృతి పాట పాడిన యూట్యూబ్ లింక్ ను ఆయన పంచుకున్నారు. నా చిట్టి తల్లిని చూస్తే గర్వంగా ఉందంటూ సుకుమార్ పోస్ట్ చేయగా కూతురిపై ఆయన చూపిస్తున్న ప్రేమ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus