Sukumar, RRR: ‘రాజమౌళి సార్.. మీకూ మాకూ ఒకటే తేడా..’ సుకుమార్ పోస్ట్ చూశారా?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన కూడా ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఎన్నడూలేని విధంగా అక్కడ ఎన్టీఆర్, రామ్ చరణ్ కటౌట్స్ కి పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు అభిమానులు. నార్త్ లోనే పరిస్థితి అలా ఉందంటే.. సౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Click Here To Watch NOW

మొదటి రోజు ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ని రాబట్టడం ఖాయమని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒక్క ఓవర్సీస్ లోనే ప్రీమియర్ షోల ద్వారా మూడు మిలియన్ డాలర్ల కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సెలబ్రిటీలు సైతం సినిమాకి రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటులు సినిమా మేకింగ్ అద్భుతంగా ఉందంటూ ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పోస్ట్ పెట్టారు.

తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. రాజమౌళిని పొగుడుతూ చిన్న కవిత రాశారు. ”మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో ఉన్నా.. మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి.. రాజమౌళి సార్, మీకూ మాకూ ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే” అంటూ రాజమౌళి ప్రతిభను కొనియాడారు. సుకుమార్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుకుమార్ లాంటి డైరెక్టర్.. రాజమౌళి స్థాయిని ఎవరూ అనుకోలేరంటూ పోస్ట్ పెట్టడం విశేషం. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సుకుమార్ గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాతో సుకుమార్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. త్వరలోనే ‘పుష్ప 2’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనులు నిర్వహించడానికి చిత్రబృందం రెడీ అవుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus