హీరోయిన్ డ్రస్సులపై కామెంట్స్ ని వెనక్కి తీసుకున్న డైరక్టర్ సురాజ్

ఇతర రంగాల్లో ఉన్న వారు సినీ రంగంలోని హీరోయిన్ల డ్రస్సులపై కామెంట్స్ ఇప్పటివరకు చూసాం. కానీ చిత్ర పరిశ్రమలో డైరక్టర్ గా ఉన్న సురాజ్ వివాదాస్పదంగా మాట్లాడి చిక్కులు తెచ్చి పెట్టుకున్నారు. ఈ డైరక్టర్ విశాల్ హీరోగా ‘కత్తి సందై’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో “ఒక్కడొచ్చాడు” గా అనువదించారు. ఈనెల డిసెంబర్ 23 న విడుదలయిన ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూలో తమన్నాతో ఎక్కువగా స్కిన్ షో చేయించారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు డైరక్టర్ సమాధాన మిస్తూ నోరు జారారు. తమన్నాకు తానే డ్రస్సులు కురచగా కొట్టమని డిజైనర్ కి చెప్పిన్నట్లు ఒప్పుకున్నారు.

“ఇది సీరియల్ కాదు.. కమర్షియల్ సినిమా ఇక్కడ గ్లామర్ గా కనిపించాలి. అందుకే సౌకర్యం కన్నా అందాల ఆరబోతకే ప్రాధాన్య మివ్వాల”ని చెప్పారు. సురాజ్ చెప్పిన సమాధానం కోలీవుడ్ లో దుమారం రేగింది. మిల్కీ బ్యూటీ తమన్నా అయితే ఘాటుగా స్పందించింది. తాము యాక్టర్లమని, ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఉన్నామని స్పష్టం చేసింది. అంతమాత్రానా  హీరోయిన్లను ఇలా అవమానించడం, తక్కువ చేసి మాట్లాడటం తగదని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమెతో పాటు మరో స్టార్ హీరోయిన్ నయనతార కూడా సురాజ్ ను వ్యతిరేకించారు. దీంతో దిగివచ్చిన సురాజ్ లేఖ ద్వారా క్షమాపణలు తెలిపారు. ‘నన్ను క్షమించండి. నటి తమన్నాకు, పరిశ్రమలోని ఇతర హీరోయిన్లకు క్షమాణలు చెబుతున్నాను. ఎవరినీ చెడుగా చూపించడం, వాళ్ళ సెంటిమెంట్స్ ని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. నా వ్యాఖ్యలను వెనక్కి  తీసుకుంటున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. ఇంతటితో ఈ వివాదం ముగిసింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus