అడ్వాన్స్ లు తీసుకుని నిర్మాతలను తిప్పించుకున్న దర్శకులు ఎవరెవరంటే…!

Ad not loaded.

యువత , ఆంజనేయులు, సోలో వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పరశురామ్ పెట్ల .. ఆ తర్వాత శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో అడుగు పెట్టాడు. ఆ సినిమా హిట్ అయ్యింది. శిరీష్ కు హిట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి. వెంటనే అరవింద్ గారు పరశురామ్ కు అడ్వాన్స్ ఇచ్చారు. అది గీత గోవిందం కి ఉపయోగ పడింది. ఆ సినిమా రూ.130 కోట్ల వరకు కలెక్ట్ చేయడంతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు పరశురాం.

దీంతో వెంటనే అల్లు అరవింద్ ఇంకో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చేశారు. కానీ ఆ తర్వాత 14 రీల్స్, మైత్రి మూవీ మేకర్స్, వంటి సంస్థలు కూడా అడ్వాన్స్ లు ఇచ్చాయి పరశురాంకి ..! అయితే గీతా కాంపౌండ్ లో సినిమా చేయాల్సిన పరశురాం… ఆ గీత దాటి.. నాగ చైతన్య తో సినిమా చేయడానికి బయటకు వచ్చాడు. కానీ మహేష్ నుండీ పిలుపు రావడంతో ఇద్దరు నిర్మాతలను భాగస్వాములుగా చేసి సర్కారు వారి పాట చేశాడు.

తర్వాత నాగ చైతన్య తో సినిమా చేద్దాం అనుకున్నా.. చైతన్యకు కథ నచ్చకపోవడంతో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఇంతలో దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ తో సినిమా అనౌన్స్ చేశాడు. ఇది అల్లు అరవింద్ గారికి కోపం తెప్పించింది. తన బ్యానర్లో సినిమా చేస్తానని చెప్పి కూడా పట్టించుకోకపోవడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి పరశురాంని కడిగేయాలి అనుకున్నారు. కానీ పరశురామ్ వెళ్లి కూల్ చేస్తే కాం అయ్యారు. ఒక హిట్టు కొట్టగానే అందిన కాడికి అడ్వాన్స్ లు తీసుకుంటే ఇలాగే ఉంటుంది వ్యవహారం.

అయితే అరవింద్ గారికి కోపం వచ్చింది కాబట్టి పరశురామ్ బయటపడ్డాడు. కానీ టాలీవుడ్ లో ఇలా నిర్మాతల దగ్గర్నుండీ అడ్వాన్స్ లు తీసుకుని సినిమాలు చేయకుండా తిరుగుతున్న దర్శకుల జాబితా పెద్దగానే ఉంది. అరకొర హిట్ కొట్టిన దర్శకులు కూడా నిర్మాతలకు ఫోన్ లు చేసి నాకు పలానా అవసరం ఉంది, అత్యవసరం ఉంది అని కారణాలు చెప్పి మరీ అడ్వాన్స్ ల రూపంలో డబ్బులు తీసుకున్న దర్శకులు ఇంకా చాలా మంది ఉన్నారు. పరశురామ్ ను చూసి వాళ్ళు జాగ్రత్త పడితే సరి. లేదంటే చాలా కష్టం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus