టాలీవుడ్ లో సమస్యలను పరిష్కరించే దిశగా ఎవరు చర్యలు తీసుకుంటారనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఒకప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు చాలా వరకు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను తీరుస్తూ వచ్చారు. ఆయన చనిపోయిన తరువాత ఆ సీట్ ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై ఇండస్ట్రీలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒకానొక సమయంలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య ఈ విషయంలో పోటీ నెలకొంది. కానీ రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి.
తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని.. సినీ ఇండస్ట్రీకి తన బాధ్యతగా సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటానే కానీ.. ఇద్దరు గొడవ పడితే వారి సమస్యను పరిష్కరించలేనని చెప్పేశారు. ఇండస్ట్రీ పెద్దరికం అనే విషయంలో సీనియర్ దర్శకులు, నిర్మాతలు ఇప్పటికే పలు సందర్భాల్లో తమ అభిప్రాయాలను చెబుతూ వచ్చారు. రీసెంట్ గా సీనియర్ డైరెక్టర్ తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీ పెద్దరికం గురించి వినిపిస్తున్న వార్తలపై స్పందించారు. ”దాసరి సింహంలాంటోడు. చూడగానే కాళ్లపై పడాలనిపించేంత పెద్ద మనిషి. ఆయన తరహానే వేరు.
ఆయనుండుంటే ఇండస్ట్రీలో చాలా సమస్యలకు పరిష్కారం దొరికేది. ఆయన దగ్గరకు లైట్ బాయ్ కూడా వెళ్లి తన సమస్యను చెప్పుకోవచ్చు. ఆయనే స్వయంగా మాట్లాడేవారు. నేరుగా సీఎం, పీఎంలతో మాట్లాడేవారు. అలాంటి వాళ్లు పుట్టాలి. మధ్యలో రారు. ఇండస్ట్రీ పెద్దగా ఫలానా వస్తే బావుంటుందని నేను అనుకోవడం కాదు. ఇండస్ట్రీ అంతా అనుకోవాలి. ఎఎవరున్నా లేకపోయినా ఇండస్ట్రీ నడిచిపోతుంది. ఇండస్ట్రీ పర్మనెంట్. నాలాంటోళ్లు వస్తుంటారు.. పోతుంటారు. మధ్య కొందరు వచ్చి నా వల్లే ఇండస్ట్రీ నడుస్తుందని అంటుంటారు. ఎవరున్నా లేకపోయినా ఇండస్ట్రీ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!