తేజ దర్శకత్వంలో మరోసారి నటించడానికి సిద్ధమవుతున్న రానా

కొన్ని కథలు కొందరికి బాగా సెట్ అయిపోతాయి. యుద్ధం నేపథ్యంలో సాగే స్టోరీలు దగ్గుబాటి రానాకీ బాగా కలిసి వచ్చాయి. అనేక ఘోరమైన యుద్ధాలు కలిగిన బాహుబలి సినిమాలు అతనికి లైఫ్ ని ఇవ్వగా.. ఆ మధ్యలో వచ్చిన ఘాజి సినిమాకూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి.భారత్, పాక్ మధ్య సముద్రంలో జరిగే ఈ వార్ అందరి అభినందనలు అందుకుంది. జాతీయ అవార్డును సైతం సాధించింది. అలాగే ప్రస్తుతం దగ్గుబాటి రానా 1945 అనే చిత్రం చేస్తున్నారు. సుభాష్ చంద్ర బోస్ జీవితం ఆధారంగా రూపుద్దికోనున్న ఈ మూవీలో స్వతంత్ర సంగ్రామాన్ని చూపించబోతున్నారు. సో ఇది కూడా యుద్ధనేపథ్యంలో సాగనుంది.

ఇలా రానాకీ యుద్ధాలు కలిసి వస్తుండడంతో మళ్ళీ వార్ నేపథ్యంలో కథకే ఓకే చెప్పినట్లు తెలిసింది. రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాని తెరకెక్కించిన తేజ తాజాగా ఒక కథ చెప్పారంటా. అది ఇండో – పాక్‌ యుద్ధం నేపథ్యంలో సాగుతుందని సమాచారం. లైన్ బాగుండడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగరవాసులు చెప్పారు. తేజ.. వెంకటేష్, బాలకృష్ణ ప్రాజెక్ట్స్ నుంచి బయటికి వచ్చారు. సో ఈ కథని డెవలప్ చేసి రానాతో సినిమా తీయనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే ఆస్కారం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus