తేజ ప్రయోగం ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో..!

‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో హిట్ అందుకుని కం బ్యాక్ ఇచ్చిన దర్శకుడు తేజ..తిరిగి ఆ ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. తరువాత అతను డైరెక్ట్ చేసిన ‘సీత’ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కాజల్ టైటిల్ రోల్ ప్లే చేసింది. వాళ్ళ క్రేజ్ కూడా ఈ చిత్రాన్ని ఫ్లాప్ అవ్వకుండా కాపాడలేకపోయింది. సరే ఇది పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ఓటిటికి మంచి డిమాండ్ పెరిగిన తరుణంలో వెబ్ సిరీస్ లు కూడా ఊపందుకున్నాయి.

చాలా మంది దర్శక నిర్మాతలు కొత్త వెబ్ సిరీస్ లను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మణిరత్నం వంటి స్టార్ డైరెక్టర్ కూడా వెబ్ సిరీస్ ను రూపొందించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో డైరెక్టర్ తేజ కూడా వెబ్ సిరీస్ ను రూపొందించనున్నాడని తెలుస్తుంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడట. అయితే వెబ్ సిరీస్ కు కూడా కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్లను తీసుకుంటూ వస్తున్నారు కొందరు దర్శకనిర్మాతలు. అయితే తేజ మాత్రం ‘బిగ్ బాస్2’ ఫేమ్ నందినీ రాయ్ ను ప్రధాన పాత్రలో పెట్టి వెబ్ సిరీస్ ను తీస్తున్నాడట.

ఈ బ్యూటీ గతంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అటు తరువాత అల్లరి నరేష్, సునీల్ హీరోలుగా నటించిన ‘సిల్లీ ఫెలోస్’ అనే చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. అయితే ప్రస్తుతం ఈమెకు అంత క్రేజ్ లేదు. మరి ఇలాంటి టైములో ఈమెతో తేజ వెబ్ సిరీస్ తియ్యడం అంటే ప్రయోగం చేస్తున్నట్టే అని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus