Teja,Uday Kiran: ఉదయ్ మరణంపై తేజ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లనే టార్గెట్ చేశారా?

చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాల విజయాలతో చిన్న వయస్సులోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ తర్వాత రోజుల్లో వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. ఉదయ్ కిరణ్ డెత్ కు సంబంధించి ఎన్నో కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఒక ప్రముఖ హీరో కుటుంబాన్ని టార్గెట్ చేయడం జరిగింది.

అయితే ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు మాత్రం ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించి వేర్వేరు కారణాలను వెల్లడించడం జరిగింది. అయితే ఉదయ్ కిరణ్ కు అత్యంత సన్నిహితులలో తేజ ఒకరు. ఉదయ్ కిరణ్ తేజ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి విదితమే. అహింస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న తేజకు ఉదయ్ కిరణ్ మృతికి సంబంధించి వేర్వేరు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఆ ప్రశ్నల గురించి (Teja) తేజ స్పందిస్తూ చాలామందికి ఉదయ్ కిరణ్ మృతి వెనుక అసలు రీజన్ తెలుసని అన్నారు. కానీ ఆ రీజన్ ను నాతోనే చెప్పించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారని తేజ కామెంట్లు చేశారు. అందరూ ఏమీ తెలియని అమాయకులలా మీరే రీజన్ చెప్పాలంటూ ఎందుకు నటిస్తున్నారో నాకు అర్థం కావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో వెలుగులోకి వచ్చిన కారణాలే వాస్తవాలని తేజ చెబుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తన కొడుకు సినీ ఎంట్రీ గురించి కూడా తేజ షాకింగ్ కామెంట్లు చేశారు. మా అబ్బాయి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడని త్వరలోనే కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని ఆయన అన్నారు. నా కూతురు చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చిందని తేజ తెలిపారు. జీవితంలో సంతోషంగా ఉండటం కోసం ఏది చేయాలనిపిస్తే అది చేయాలని పక్కవాళ్ల కోసం ఆలోచించవద్దని నా పిల్లలకు చెబుతానని తేజ చెప్పుకొచ్చారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus