Chitram: హిట్‌ సీక్వెల్‌కి తేజ రెడీ… మరి నిర్మాత ఎవరో? హీరో ఎవరో?

చిన్న సినిమా పెద్ద విజయం… ఈ మాట అనేటప్పుడల్లా కచ్చితంగా ప్రస్తావించాల్సిన సినిమా ‘చిత్రం’. (Teja) తేజ దర్శకత్వంలో దివంగత ఉదయ్‌ కిరణ్‌ హీరోగా, రీమా సేన్‌ (Reema Sen) హీరోయిన్‌గా రూపొందిన చిత్రమిది. రూ. 42 లక్షలతో 24 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా భారీ వసూళ్లనే అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఓసారి ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. కానీ ఎందుకో కానీ మళ్లీ ఆ ముచ్చట వినిపించలేదు. అయితే ఇప్పుడు మరోసారి ‘చిత్రం’ సీక్వెల్‌ టాపిక్‌ చర్చకు వచ్చింది.

నేటి ట్రెండ్‌కి తగిన కథతో.. కొత్త హీరోతో ఈ సినిమా ఉంటుందని తాజాగా వార్తలొస్తున్నాయి. హీరో ఎవరు అనే విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, ఇండస్ట్రీకి చెందిన వారసుడే ఆ సినిమా చేస్తాడని టాక్‌. అయితే మరి ఈ సినిమాకు నిర్మాత ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ‘చిత్రం’ సినిమాను తెరకెక్కించిన ఉషా కిరణ్‌ మూవీస్‌ ఇప్పుడు సినిమాల నిర్మాణంలో యాక్టివ్‌గా లేదు. అయితే ఈటీవీ విన్‌తో కలసి ఏమన్నా తేజ ఈ సినిమా నిర్మిస్తారేమో చూడాలి.

తేజతో కలసి మ్యాజికల్‌ మ్యూజిక్‌ ఇచ్చిన ఆర్పీ పట్నాయక్‌ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తారని గతంలో వార్తలొచ్చాయి. మరిప్పుడు కూడా అతననే కొనసాగిస్తారా లేదా కొత్త సంగీత దర్శకుడిని తీసుకుంటారా అనేది చూడాలి. తొలి సినిమాకు ఈ సినిమాకు ఏమన్నా కనక్షన్‌ ఉంటుందా? లేక పూర్తిగా కొత్త కథతో వస్తారా అనేది చూడాలి. ప్రస్తుత సమాచారం ప్రకారం అయితే తొలి సినిమా జంటకు పుట్టిన బిడ్డ ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు.

మరోవైపు తేజ (Rana) రానాతో ‘రాక్షస రాజా’ అనే సినిమా చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దాని గురించి వర్క్‌ జరుగుతోంది అని కూడా చెప్పారు. మరిప్పుడు (Chitram) ‘చిత్రం’ సినిమా సీక్వెల్‌ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది ఆసక్తికరంగా మారింది.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus