Tharun Bhascker: వెంకీ- తరుణ్..ల సినిమా ఆగిపోవడానికి అసలు కారణం అదట..!

విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం ‘సైందవ్’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. ఇటీవల టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. వెంకటేష్ లో ఉన్న మాస్ యాంగిల్ చాలా రోజుల నుండి మిస్ అవుతూ వచ్చింది. దానిని శైలేష్ బయటకు తీసే ప్రయత్నం చేసినట్లు టీజర్ చెబుతుంది. అందుకే వెంకటేష్ ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

వెంకటేష్, సురేష్ బాబు అంత ఈజీగా స్క్రిప్ట్ ని ఓకే చేసే రకాలు కాదు. కానీ శైలేష్ కి ఆ ఛాన్స్ వెంటనే ఇచ్చేశారు. గతంలో ఇలానే తరుణ్ భాస్కర్ కి కూడా ఛాన్స్ లభించింది. ఈ కాంబినేషన్లో సినిమా పక్కా అని అంతా అనుకున్నారు. కానీ అది అనౌన్సమెంట్ దశలోనే ఆగిపోయింది. దీనిపై వెంకటేష్ ని ప్రశ్నించగా.. ‘ఎన్నో అనుకుంటాం అన్నీ జరగాలని లేదు కదా’ అంటూ జవాబిచ్చాడు. అయితే ‘కీడా కోలా’ ప్రమోషన్స్ లో దర్శకుడు తరుణ్ భాస్కర్ ను ఈ విషయం పై ప్రశ్నించగా..

‘వెంకటేష్ గారితో మూవీ చేయాలి. కానీ సెకండ్ హాఫ్ నేను అనుకున్నట్టు లేదు అని, రైటింగ్ సైడ్ వర్క్ ఇంకా చేయాలని భావించాను. ఇప్పుడైతే ఆ వర్క్ అయ్యింది. సురేష్ బాబు గారు అయితే హ్యాపీగా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ‘కీడా కోలా’ తర్వాత దాని పనులు మొదలుపెడతాను’ అంటూ చెప్పుకొచ్చాడు. వెంకీ – తరుణ్ (Tharun Bhascker) ఇద్దరి స్పందన చాలా డిఫరెంట్ గా ఉంది. మరి ఏమవుతుందో చూడాలి..!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus