Trivikram: ‘గుంటూరు కారం’ సెకండ్ హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ ఓల్డ్ కామెంట్స్ వైరల్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మహేష్ తో చేస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ రెండు వారాలు నాన్ స్టాప్ గా జరుగుతుంటే… తర్వాత రెండు నెలల పాటు ఆగిపోతూ వస్తోంది. ఏదైతేనేం.. 2024 జనవరి 13 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని టీం ఫిక్స్ అయ్యింది. అధికారిక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో ఈ ప్రాజెక్ట్ లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి.

మొదట ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎంపికైన పూజా హెగ్డే తప్పుకుంది. కాబట్టి సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయ్యింది. మరి సెకండ్ హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అనే చర్చలు మొదలైన టైంలో సంయుక్త మీనన్ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే సంయుక్త మీనన్ కూడా ఇప్పుడు ఖాళీగా లేదు. కాబట్టి..మీనాక్షి చౌదరికి లుక్ టెస్ట్ చేయగా.. ఆమె ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తుంది.

ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇది నిజమే అని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉండగా.. మీనాక్షి చౌదరి గురించి త్రివిక్రమ్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీనాక్షి మొదటి సినిమా ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన త్రివిక్రమ్.. ‘మీనాక్షి బిజీ హీరోయిన్ అయిపోతుందని..

తర్వాత తన నెక్స్ట్ సినిమాకి డేట్స్ ఇవ్వాలి’ అంటూ (Trivikram) త్రివిక్రమ్ కోరాడు. అప్పటికే ‘గుంటూరు కారం’ ప్రాజెక్టు ను అధికారికంగా ప్రకటించేశారు. త్రివిక్రమ్ కామెంట్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus