Trivikram: త్రివిక్రమ్ సెంటిమెంట్.. ఈసారి హ్యాట్రిక్ కొడతాడా?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ దర్శకులు అందరూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఎప్పటి నుంచో మంచి దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం తెలుగులోనే పెద్ద సినిమాలను చేసేందుకు ఇష్టపడుతున్నాడు. పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం అయితే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో మంచి సక్సెస్ లు అందుకున్నప్పటికి కూడా అవి కాపీ ఆరోపణలు అని వచ్చాయి.

Click Here To Watch

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఈ దర్శకుడు చాలా రకాల ట్రోల్స్ కు గురయ్యాడు. ఈ రోజుల్లో హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. నిమిషాల్లోనే కనిపిట్టేసస్తున్న జనాలు అవసరమైతే కడిగి పారేస్తున్నారు. ఇక మొత్తానికి అల వైకుంఠ పురం లో సినిమా మంచి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల మహేష్ బాబు కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా కోసం మళ్లీ మూడవసారి పూజా హెగ్డేను సెలెక్ట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ ఒక విధంగా మూడు అనే సెంటిమెంట్ ను చాలా బలంగా కొనసాగిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇదివరకే సమంతతో వరుసగా మూడు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అత్తారింటికి దారేది సన్నాఫ్ సత్యమూర్తి అ ఆ సినిమాలు చేసిన త్రివిక్రమ్ సమంతను విభిన్నంగా చూపించి మంచి విజయాలను అందుకున్నాడు. పూజ హెగ్డేను కూడా అదే తరహాలో కొనసాగిస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత అల్లు అర్జున్ తో చేసిన అల వైకుంఠ పురములో సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజ నటించింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా ఫైనల్ చేశారు. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడు అనే సెంటిమెంటును చాలా బలంగా ఫాలో అవుతున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus