Vamshi Paidipally: మొన్న తమిళ సినిమా… ఇప్పుడు హిందీ సినిమా… తెలుగులో లేవా? చేయడం లేదా?

తెలుగు సినిమా దర్శకులు ఇతర భాషల్లోకి వెళ్లడడం, అక్కడ స్టార్‌ హీరోలతో సినిమాలు చేయడం మనకు గర్వకారణమే. అయితే ఇక్కడడ పూర్తిగా సినిమాలు చేయడం మానేయడమో లేకపోతే అవకాశాలు రాకపోవడమో జరిగితేనే ఇబ్బందిగా ఉంటుంది. ఈ రెండింటిలో కారణం ఏదో తెలియదు కానీ.. మరో తెలుగు దర్శకుడు బాలీవుడ్‌కి వెళ్తున్నారట. మామూలుగా అయితే వెళ్తున్నారు అని అనాలి కానీ.. ఆయనే అవునో, కాదో అన్నారు కాబట్టి వెళ్తున్నారట అని అంటున్నాం.

ఇంగ్లిష్‌ సినిమాలను మన సినిమాలుగా చూపించడంలో టాలీవుడ్‌లో ఆ దర్శకుడు సిద్ధహస్తుడు అని చెప్పొచ్చు. మన నేటివిటీకి దగ్గరగా ఆ కథను తెరకెక్కించి వావ్‌ అనిపిస్తుంటారాయన. చేసిన సినిమాలు తక్కువే అయినా అన్నీ స్టార్‌ హీరోలతో చేసినవే. మల్టలీస్టారర్‌లు కూడా చేసి మెప్పించారాయన. ఆయనే వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) . ‘వరిసు’ (Varisu) / ‘వారసుడు’ సినిమాతో గతేడాది ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన ఆ తర్వాత కొత్త సినిమా ఏదీ స్టార్ట్‌ చేయలేదు. ఒకరిద్దరు స్టార్‌ హీరోల పేర్లు వినిపించినా ఓకే అవ్వలేదు.

అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి కొత్త సినిమా అంటూ ఓ ప్రాజెక్ట్‌ చర్చలోకి వచ్చింది. ఆ పుకార్ల ప్రకారం చూస్తే… ఆయన త్వరలో బాలీవుడ్ విమానం ఎక్కబోతున్నారట. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు షాహిద్‌ కపూర్‌ హీరోగా పాన్‌ఇండియా స్థాయిలో ఓ సినిమా సిద్ధం చేస్తున్నారట. తెలుగు నిర్మాతలు కలసి రూపొందించనున్న ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్‌ వంశీకి వచ్చింది అనేది లేటెస్ట్‌ టాక్‌. అయితే ఈ విషయంలో ఈ రూమర్స్‌ని ఆయన తాజాగా కొట్టిపారేశారు.

‘మరి, మీ నెక్స్ట్‌ ప్రాజెక్టు ఏంటి? అని అడిగితే… ఆ వివరాలు చెప్పడానికి ఇంకా టైమ్‌ ఉందని అన్నారు. దీంతో షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor) సినిమా ఇంకా చర్చల దశలో ఉందని, అది ఓకే అయ్యేంతవరకు వంశీ ఇలా కామ్‌గా ఉంటారు అని అంటున్నారు. ఆ మధ్య అల్లు అరవింద్‌ (Allu Aravind) , దిల్‌ రాజు (Dil Raju) కలసి షాహిద్‌ కపూర్‌తో స్ట్రయిట్‌గా ఓ సినిమా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నిర్మాతలు కలసి లేరు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus