కాంబినేషన్ ని కాదు కంటెంట్ ను నమ్ముకొన్నోడు..!

  • April 5, 2016 / 02:47 PM IST

కొందరు దర్శకులు కాంబినేషన్లను నమ్ముకొని సినిమాలు తెరకెక్కిస్తుంటారు. కానీ కొందరు మాత్రమె కంటెంట్ మీద నమ్మకంతో సినిమాలను రూపొందిస్తుంటారు. ఆ తరహా రూపకర్తలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలా లెక్కించగలిగిన వారిలో మొదటి వరుసలో పేర్కొనదగిన దర్శకుడు వంశీకృష్ణ. మంచు లక్ష్మి కీలకపాత్రలో.. అడివి శేష్ హీరోగా నటించిన “దొంగాట” గతేడాది విజయం సాధించిన చిత్రాల్లో ఒకటి. డిఫరెంట్ కాన్సెప్ట్, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే కలగలిసి “దొంగాట” ఘన విజయం సొంతం చేసుకొంది. దర్శకుడిగా తోలి చిత్రంతోనే ఘన విజయం సాధించిన వంశీకృష్ణ చిత్ర పరిశ్రమను విశేషంగా ఆకట్టుకొన్నాడు. వేంటనే పలు అవకాశాలు తన వద్దకు వచ్చినా సున్నితంగా వాటిని తిరస్కరించి.. మంచు లక్ష్మి సారధ్యంలో రూపొందుతున్న రియాలిటీ షో “మేము సైతం”కు క్రియేటివ్ హెడ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

వంశీకృష్ణ ప్రతిభను గుర్తించిన చెన్నైకు చెందిన “కళాసుధ” వారు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్ అనౌన్స్ చేశారు. త్వరలో ఈ అవార్డ్ ప్రధానోత్సవం చెన్నైలో జరగనుంది. ఈ సందర్భంగా యువ ప్రతిభాశాలి వంశీకృష్ణకు ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు చెబుతూ.. భవిష్యత్ తో వంశీ “దొంగాట” వంటి మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు తెరకెక్కించడంతోపాటు.. ఈ తరహా అవార్డులను లెక్కకు మిక్కిలి సొంతం చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకొంటొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus