Vasishta: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన వశిష్ట దంపతులు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో డైరెక్టర్ వశిష్ట ఒకరు. దర్శకుడిగా బింబిసారా సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని కూడా అందుకున్నారు.ప్రస్తుతం చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ త్రిష నటించబోతున్నారు. ఇక ఇటీవల సినిమా షూటింగ్ లొకేషన్లోకి త్రిష కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతున్నటువంటి తరుణంలోనే మరొక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా డైరెక్టర్ వశిష్ట తండ్రి అయ్యారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

ఈ విషయం గురించి ఎక్కడ అధికారక ప్రకటన లేదు కానీ వశిష్ట (Vasishta) భార్య సుజాత సోమవారం సాయంత్రం ఆడపిల్లకు జన్మనిచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వశిష్ట అసలు పేరు వేణు ఈయన తండ్రి నిర్మాత కావడంతో ఈయన కూడా ప్రేమలేఖ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అనంతరం దర్శకుడుగా ఇండస్ట్రీకి వచ్చారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus