Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

‘హరి హర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు సినిమా మీద వచ్చిన నెగిటివిటీ చాలా వరకు ఈ ట్రైలర్‌తో తుడిచిపెట్టుకుపోతుంది అని సినిమా పరిశీలకులు అంటున్నారు. ఆ విషయం పక్కనపెడితే ట్రైలర్‌లో పవన్‌ (Pawan Kalyan) స్క్రీన్‌ ప్రజెన్స్‌, డైలాగ్‌లు, యాక్షన్‌ సీన్స్‌తోపాటు మరో విషయం హైలైట్‌గా నిలిచింది. అదే వాయిస్‌ ఓవర్‌. ఆ బేస్‌ వాయిస్‌ వినగానే అది ప్రముఖ నటుడు అర్జున్‌ దాస్‌ది అని ఈజీగానే చెప్పేయొచ్చు.

Pawan Kalyan

ఆ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినందుకు అర్జున్‌ దాస్‌కు పవన్‌ కల్యాణ్‌ థ్యాంక్యూ చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. పోస్టు పెట్టారు అనేకంటే అర్జున్‌ దాస్‌ ఉదయం చేసిన పోస్ట్‌కి రిప్లై ఇచ్చారు అనే చెప్పాలి. సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ నేపథ్యంలో అర్జున్‌ దాస్‌ ఓ ట్వీట్‌ చేశాడు. సినిమా ట్రైలర్‌కి వాయిస్‌ ఇస్తావా అని పవన్‌ కల్యాణ్‌ అడగగానే మరో మాట లేకుండా వెంటనే యస్‌ చెప్పేశా. ఇది మీ కోసం చేశా సర్‌.. అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చాడు అర్జున్‌ దాస్‌.

దానికి పవన్‌ ఇప్పుడు రిప్లై ఇచ్చారు. రిప్లైలో థ్యాంక్యూ మాత్రమే ఉండి ఉంటే అది పవన్‌ రిప్లై ఎందుకు అవుతుంది. అందులో ఆయన స్టయిల్‌ మాటలు కూడా ఉన్నాయి. డియర్‌ బ్రదర్‌ అర్జున్‌ దాస్‌.. నేను చాలా తక్కువగా ఇతరుల సాయం కోరతాను. అలా ‘హరి హర వీరమల్లు’ వాయిస్‌ ఓవర్‌ కోసం నిన్ను అడిగాను. నా మాట మన్నించి వాయిస్‌ ఇచ్చినందుకు థ్యాంక్యూ. నీ గొంతు మాయ చేసింది అని రాసుకొచ్చారు పవన్‌.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. క్రిష్ – జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తొలి పార్ట్‌ సంగతి ఇప్పుడు తేలుతోంది. మరి రెండో పార్ట్‌ సంగతి ఏంటో చూడాలి. ఎందుకంటే పవన్‌ ఇప్పటికిప్పుడు మళ్లీ ఈ సినిమాకు డేట్స్‌ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు.

నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus