Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కొడుకు మార్క్ శంకర్ పేరు మొన్నామధ్య బాగా మార్మోగింది. విదేశాల్లో(సింగపూర్లో) అతను చదువుకుంటున్నాడు. మొన్నామధ్య ఇతని స్కూల్‌లో అగ్నిప్రమాదం జరగడంతో .. మార్క్ శంకర్ అనారోగ్యం పాలయ్యారు. అక్కడ వ్యాపించిన పొగ… మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయి.

Pawan Kalyan son Mark Shankar

దీంతో అక్కడి ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. ఇప్పుడు అతను పూర్తిగా కోలుకున్నాడు. మార్క్ శంకర్ లేటెస్ట్ ఫోటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్త (Pawan Kalyan) న ఇద్దరు కుమారులతో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫొటోలో పవన్ పెద్ద కుమారుడు అకీరా నందన్ (Akhira Nandhan), చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) ఉండటాన్ని గమనించవచ్చు. అకీరా ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రీ రిలీజ్ సినిమాల టైంలో కూడా అతను ఎక్కువగా సందడి చేస్తూ ఉంటాడు. అయితే లేటెస్ట్ ఫోటోలో అకీరా కంటే మార్క్ శంకర్ హైలెట్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే మార్క్ శంకర్.. చాలా వరకు అతని తండ్రి పవన్ కళ్యాణ్ మాదిరి కనిపిస్తున్నాడు.

పలు సినిమా వేడుకల్లో పవన్ కళ్యాణ్ గడ్డం, మీసం తీసేసి కనిపించారు. అలాంటి టైంలో తీసిన కొన్ని ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మార్క్ శంకర్ లేటెస్ట్ లుక్.. చాలా అలానే ఉన్నాయి. అందుకే కొందరు నెటిజన్లు పవన్ కళ్యాణ్ – మార్క్ ఫోటోలను పక్క పక్కనే పెట్టి వైరల్ చేస్తున్నారు.

ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus