Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

‘సెప్టెంబర్ 25’ ఈ డేట్ కొద్దిరోజుల నుండి హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ డేట్ ని సంక్రాంతి సీజన్ లెవెల్లో మన ఫిలిం మేకర్స్ చూస్తున్నారు. ఇదే డేట్ కి నందమూరి బాలకృష్ణ (Balakrishna) – బోయపాటి శ్రీను (Boyapati Srinu)..ల ‘అఖండ 2’ (Akhanda2) అనౌన్స్ చేశారు. ఇటీవల విడుదలైన టీజర్ తో కూడా సెప్టెంబర్ 25నే వస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.వి.ఎఫ్.ఎక్స్ పనులు పెండింగ్ ఉన్నప్పటికీ.. ఆ డేట్ ఎలా కన్ఫర్మ్ చేశారో మేకర్స్ కే తెలియాలి.

Vishwambhara

మరోపక్క నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ వస్తాయి అనే ఉద్దేశంతో ఆ డేట్ లాక్ చేసినట్టు కూడా టాక్ నడుస్తుంది. దీనిపై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా కూడా ఈ సెప్టెంబర్ 25 కే వస్తుందని ప్రకటించారు. కూటమి పార్టీకి చెందిన హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం కష్టం. కానీ ఆ తప్పుకునే సినిమా ఏదో క్లారిటీ రావాలి.

ఇదిలా ఉంటే.. ఇంకో వైపు మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా సెప్టెంబర్ 25నే రిలీజ్ కానుంది అనే టాక్ ఇప్పుడు మొదలైంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడింది. తర్వాత 6 నెలలు గడిచినా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది లేదు. వి.ఎఫ్.ఎక్స్ సంతృప్తి కరంగా వచ్చిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటించాలని టీం భావించింది.

మొత్తానికి ఇప్పుడు వి.ఎఫ్.ఎక్స్ కంపెనీ ఫైనల్ కాపీ చిత్ర బృందానికి సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో సరైన రిలీజ్ డేట్ కోసం ‘విశ్వంభర’ టీం కనిపెడుతున్నట్టు టాక్. ఈ క్రమంలో వారి కన్ను సెప్టెంబర్ 25పై పడిందట. ‘అఖండ 2’ ‘ఓజి’ ఉండగా ‘విశ్వంభర’ వచ్చే అవకాశం లేదు. కానీ ‘విశ్వంభర’ కోసం ఆ 2 సినిమాల మేకర్స్ స్పేస్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి మరి ఇక ఏమవుతుందో..!

 పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus