Allu Arjun: బన్నీతో సినిమా పక్కా అంటోన్న డైరెక్టర్!

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాలో నటిస్తోన్న సమయంలో ‘ఐకాన్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ‘ఎంసీఏ’ సినిమాతో హిట్టు కొట్టిన దర్శకుడు వేణుశ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్నారు. టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో బన్నీ నెక్స్ట్ సినిమా ఇదేనని అందరూ అనుకున్నారు. కానీ బన్నీ కాస్త గ్యాప్ తీసుకొని ‘అల.. వైకుంఠపురములో’ సినిమా చేశారు. ఆ తరువాత ‘పుష్ప’ సినిమాను మొదలుపెట్టారు. దీని తరువాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్లో ఉన్నాయి. దీంతో ఇక ‘ఐకాన్’ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

రీసెంట్ గా బన్నీ స్నేహితుడు నిర్మాత బన్నీ వాసు ‘ఐకాన్’ ప్రాజెక్ట్ ఉంటుందని.. బన్నీకి సమయం కుదిరినప్పుడు చేస్తాడని చెప్పాడు. కానీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేదు. తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాను కలిసిన దర్శకుడు వేణుశ్రీరామ్ కి ‘ఐకాన్’ సినేమకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి ఆయన ‘ఐకాన్’ ప్రాజెక్ట్ ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తనకు కూడా తెలియదని అన్నాడు.

అంతకుమించి సినిమా గురించి మరో మాట మాట్లాడలేదు. ‘వకీల్ సాబ్’ తరువాత ఏ సినిమా చేయబోతున్నారని.. ఈ దర్శకుడ్ని ప్రశ్నించగా.. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏమీ ఆలోచించలేదని.. తన దృష్టి మొత్తం ఏప్రిల్ 9న రిలీజ్ కాబోయే ‘వకీల్ సాబ్’ సినిమా మీదే ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని.. ‘వకీల్ సాబ్’ స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టిందని అన్నారు. ఒరిజినల్ కంటెంట్ పై ఎఫెక్ట్ పడకుండా కొత్త ఎలిమెంట్స్ జోడించినట్లు చెప్పారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus