ఫస్ట్ ఇన్నింగ్స్‌కు ఓపెనింగ్ ఎంత కీలకమో, సెకండ్ ఇన్నింగ్స్‌కీ అంతే కీలకం. లేకపోతే ఆట బెడిసికొడుతుంది. ఇది క్రికెట్‌కి ఇన్నాళ్లూ వర్తించేది. అయితే కరోనా ఆడుతున్న ఆటలో కూడా ఇదేపాయింట్‌ను కీలకంగా తీసుకోవాలేమో. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇటీవల థియేటర్లు తెరుచుకున్నాయి. వారానికి నాలుగైదు సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే అందులో విజయాలు ఎన్ని, పరాజయాలు ఎన్ని అనేది పక్కనపెడితే… జనాలు థియేటర్లకు వస్తున్నారా? అనేదే ఇక్కడ ప్రశ్న. దీనికి ప్రథమ సమాధానం… ‘లేదు ’ అనే వస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకుని రెండు వారాలు అయిపోయింది. ‘తిమ్మరుసు’, ‘ఇష్క్’ కాస్త పేరున్న సినిమాలు. ఆ రెండింటిలో ‘తిమ్మరసు’ మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించింది. ‘ఇష్క్’ గురించి మాట్లాడక్కర్లేదు. పాజిటివ్ టాక్‌తో సినిమా రిలీజ్ అయినా నిర్మాతలను నిరాశపరిచింది. ఇక రెండో వారం సంగతి.. చూస్తే ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ ఒక్కటే కాస్త చెప్పుకోదగ్గ వసూళ్లు సాధిస్తోంది. అయితే ఆ జోరు వీకెండ్‌కే పరిమితమైపోయింది. వచ్చే వారం సినిమాల సంగతి చూస్తే… ‘పాగల్’ కాస్త ఆశలు రేకెత్తిస్తోంది.
దీంతో టాలీవుడ్ బాక్సాఫీసు ఇబ్బందుల్లో పడింది. వసూళ్లు లేక ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో సరైన హిట్ పడితేనే బాగుంటుంది. కరోనా తొలి సీజన్ తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ వచ్చి ఊపు తీసుకొచ్చింది. ఆ తర్వాత సంక్రాంతి సీజన్ మొదలై మంచి విజయాలు, వసూళ్లు అందుకుంది. కానీ ఈసారి సరైన ఓపెనింగ్ దక్కలేదనే చెప్పాలి. సినిమా పెద్దలు ఆలోచించి సరైన సినిమాలు తీసుకొస్తేనే మంచిది అనే అభిప్రాయం వినిపిస్తోంది.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!