తెలుగు సినిమా స్థాయిని పెంచింది రాజమౌళి (S. S. Rajamouli) . అప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో రూ.100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడం అంటే సాహసమే అని మేకర్స్ భావించే వాళ్ళు. అలాంటి టైంలో ‘మగధీర’ ని (Magadheera) రూ.75 కోట్ల బడ్జెట్ తో తీశాడు. అది రూ.150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తర్వాత రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన మొదటి సినిమా ఏంటంటే కచ్చితంగా ‘బాహుబలి’ (Baahubali) అనే చెప్పాలి.
అప్పటికి తెలుగులోనే కాదు సౌత్లో ఇంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమా మరొకటి లేదు. అందుకే బాలీవుడ్ మొత్తం తెలుగు సినిమా వైపు చూసింది.ఈ సినిమా ఏ రేంజ్లో కలెక్ట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తర్వాత ‘బాహుబలి 2’ (Baahubali 2) ఇప్పటికీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు ఆ సినిమా రికార్డ్స్ ను ఏ సినిమా బ్రేక్ చేయలేదు. అంతటి రాజమౌళి (Rajamouli).. ఇండస్ట్రీని చెడగొట్టాడు అంటూ ఓ డిస్ట్రిబ్యూటర్ అనడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది.
అతని వివరణ ప్రకారం.. ‘టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయితేనే చేస్తున్నారు. ఒకప్పటిలా వాళ్ళు రూ.100 కోట్ల బడ్జెట్ అంటే సినిమాలు చేయడం లేదు. కాబట్టి నిర్మాతలు వాళ్ళతో పాన్ ఇండియా సినిమాలు అయితేనే చేయాలి అని డిసైడ్ అయిపోయారు. వందల కోట్లు కుమ్మరించి సినిమాలు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా రేట్లు పెట్టి ఆ సినిమాలను కొనుగోలు చేయాలి. పొరపాటున ఆ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే.. భారీ నష్టాలు తప్పడం లేదు.
తర్వాత స్టార్ హీరోలు మళ్ళీ పాన్ ఇండియా కథ దొరికితేనే కానీ సినిమా చేయడం లేదు. రాంచరణ్ (Ram Charan) , ఎన్టీఆర్ (Jr NTR) , అల్లు అర్జున్ (Allu Arjun) వంటి హీరోలంతా 2,3 ఏళ్ళకి కానీ ఒక సినిమా రిలీజ్ చేయడం లేదు. ప్రభాస్ (Prabhas) మాత్రం చాలా బెటర్. అతను వరుస సినిమాలు చేస్తున్నాడు. హెల్త్ కనుక సపోర్ట్ చేస్తే కచ్చితంగా అతను వేగంగా సినిమాలు చేస్తాడు అంటూ ఆ డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయపడ్డాడు. నైజాం తీసేస్తే.. ఆంధ్రలో చాలా పాన్ ఇండియా సినిమాలు బ్రేక్ ఈవెన్ కావడం లేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ తో (RRR) సహా ‘సలార్'(Salaar) ‘కల్కి’ (Kalki 2898 AD) ‘పుష్ప 2’ (Pushpa 2) వంటి సినిమాలు అన్నీ కూడా నష్టాలే మిగిల్చాయి.
స్టార్ హీరోస్ లో #Prabhas చాలా Better…
– Distributor Satyanarayana pic.twitter.com/eb27td0Mm2
— Movies4u Official (@Movies4u_Officl) May 13, 2025