థియేటర్ల ఓనర్లకు డిస్ట్రిబ్యూటర్ల ఆఫర్.. ఏమైందంటే?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న సినిమాలకు థియేటర్ల సమస్య ఉన్న సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్లలో మెజారిటీ థియేటర్లకు అగ్రిమెంట్లు పూర్తవగా కొన్ని థియేటర్లకు మాత్రం అగ్రిమెంట్లు పూర్తి కాలేదు. అలాంటి థియేటర్ల కోసం ఊహించని స్థాయిలో పోటీ ఉందని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు థియేటర్ల కోసం రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలపై ఆధారపడుతున్నారు. వాళ్లతో థియేటర్ల ఓనర్లకు ఫోన్ కాల్స్ చేయించి తమకే థియేటర్లు ఇచ్చేలా చూడాలని డిమాండ్ చేయిస్తున్నారు.

సాధారణంగా థియేటర్ల ఓనర్లు సినిమాలను రిలీజ్ చేయాలంటే అడ్వాన్స్ లను పంపాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండు వారాల రెంట్ ముందే ఇస్తాం అని ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్ల ఓనర్లకు డిస్ట్రిబ్యూటర్లు బంపర్ ఆఫర్ ఇస్తున్నా కొంతమంది థియేటర్ల ఓనర్లు మాత్రం ఆ ఆఫర్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ తమకు బెనిఫిట్ కలిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ సినిమా ఎన్ని థియేటర్లలో రిలీజ్ కానుందనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

వారసుడు సినిమాలు ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాలు రికార్డు స్థాయి స్క్రీన్లలో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. సంక్రాంతి సినిమాలలో ఏ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాల బడ్జెట్ 500 కోట్ల రూపాయలు కాగా కనీసం 550 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఈ సినిమాలన్నీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు, తమిళ రాష్ట్రాలలో ఈ సినిమాలు ఏ రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అతి త్వరలో ఈ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకానున్నాయి. చిరంజీవి, బాలయ్య బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus