సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు వారికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమిళ ప్రజలను ఆకట్టుకోనున్నారు. తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో అతను చేస్తున్న స్పైడర్ మూవీ ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లో జెండా పాతాలని మహేష్ కష్టపడుతున్నారు. అందుకే తమిళ వెర్షన్ లోను స్వయంగా తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి ఒక పాట మాత్రమే షూటింగ్ మిగిలి ఉంది. ఈ పాటను యూరప్ లోని అందమైన లోకేషన్లో చిత్రీకరించనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలోనూ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోంది.
కోలీవుడ్ లో అడుగుపెడుతున్న మహేష్ కి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఘనంగా స్వాగతం పలకనున్నారు. సెప్టెంబర్ 9న లాంచింగ్ వేడుకను చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.