Divya Sripada: ‘యశోద’ లో దివ్య శ్రీపాద రోల్ ఏంటంటే..?

కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఒకే పాత్రను పలుసార్లు పోషించే అవకాశం వస్తుంది. ఇక మేం ఇలాంటి రోల్స్ చెయ్యం బాబోయ్ అని దణ్ణం పెట్టే వరకు మన మేకర్స్ జనాలు చూస్తున్నారు కదా అని వాళ్లకి ఒకేరకం క్యారెక్టర్లు ఇస్తుంటారు. ఉదాహరణకు బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్‌నే తీసుకుంటే.. ఆన్ స్క్రీన్ భార్య భర్తలుగా ఎన్నిసార్లు కనిపించినా ఆడియన్స్‌కి బోర్ అనిపించలేదు. అందరు ఆర్టిస్టుల విషయంలో ఇలాంటి మ్యాజిక్ అనేది రిపీట్ కాదు.

కానీ యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ యాక్ట్రెస్ దివ్య శ్రీపాద విషయంలో మాత్రం మ్యాజిక్ జరిగింది. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన దివ్య.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని.. చాలా త్వరగా సినిమాల్లో నటించే ఛాన్స్ అందుకుంది. ‘కలర్ ఫొటో’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’, ‘పుష్ప’ లాంటి సినిమాల్లో నేచురల్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించింది.రీసెంట్‌గా బెల్లంకొండ గణేష్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ‘స్వాతిముత్యం’ లో కీలకపాత్రలో నటించింది.

కథను మలుపుతిప్పే క్యారెక్టర్‌లో దివ్య నటన అలరిస్తుంది. అయితే ఇందులో తను చేసిన పాత్రనే, సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా థ్రిల్లర్ ‘యశోద’ లో మళ్లీ చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనిలో పనిగా కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ‘యశోద’ ట్రైలర్‌లో సరోగసీ నేపథ్యంతో సాగే కథ ఇదని రివీల్ చేస్తూ.. సమంతతో పాటు దివ్యను కూడా ప్రెగ్నెంట్ లేడీగా చూపించారు. ‘స్వాతిముత్యం’ లోనూ ఆమె సరోగసీ ద్వారా బిడ్డను కనే క్యారెక్టరే చేసింది.

దీంతో వెంట వెంటనే రెండు సినిమాల్లోనూ ఒకేలాంటి రోల్స్ చేస్తోంది. ‘స్వాతిముత్యం’ లో కరెక్టుగా హీరో పెళ్లి టైంకి వచ్చి రచ్చ రచ్చ చేసింది. మరి ‘యశోద’ లో దివ్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుందోనంటూ మూవీ లవర్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నవంబర్ 11 వరకు ఆగితే వాళ్ల సందేహాలకు సమాధానం దొరికేస్తుంది.. ఆ రోజే ‘యశోద’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus