కుర్రాడు హీరో మెటీరియలే… కానీ సరైన సినిమాలు పడటం లేదు అనుకుంటారు అతన్ని చూస్తే. సరైన ఎనర్జిటిక్ పాత్ర పడితే అదరగొట్టేస్తాడు అని కూడా అంటుంటారు. ఎట్టకేలకు అనుకున్నది జరిగేలా ఉంది. ఆ కుర్రాడు సిద్ధు జొన్నలగడ్డ అయితే, ఆ పాత్ర డీజే టిల్లు. ఈ డీజే పబ్బుల్లో వాయించేది కాదు… భాగ్యనగరం సంధుల్లో వాయించేది. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు పాత్ర ఎలా ఉంటుందో. అన్నీ అనుకున్నట్లుగా సాగితే రెండో ‘డీజే టిల్లు’ కూడా వస్తాడు అని అంటున్నాడు సిద్ధ.
‘డీజే టిల్లు’ కథ, స్క్రీన్‌ప్లేలో సిద్ధు కూడా భాగమయ్యాడు. దర్శకుడు విమల్ కలిసి రాశారు. స్క్రిప్ట్ సిద్ధమయ్యాక సిద్ధునే మాటలు రాశాడట. పుట్టి పెరిగిన మల్కాజ్‌గిరి ఏరియాలో గమ్మత్తైన మనస్తత్వాలున్న యువకుల్ని చూశాడట సిద్ధు. వాళ్లు తాగితే ఒకలా మట్లాడతారు. మామూలుగా ఉంటే ఒకలా మాట్లాడతారట. అవన్నీ గమనించి, టిల్లు పాత్రను పోషించా అని చెబుతాడు సిద్ధు. వాళ్ల ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ టిల్లులో చూస్తారు అంటున్నాడు. వస్త్రధారణ నుండి మాటలు వరకు అన్నీ అదో రకం.
బాగా ఆకట్టుకుంటాయి. జేబులో చిల్లి గవ్వ లేకపోయినా, కాన్ఫిడెన్స్ వీరలెవల్‌లో ఉంటుంది. ఈ సినిమా బాగా ఆడితే ‘డీజే టిల్లు2’ని తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నామని చెప్పాడు సిద్ధు. ఇంట్లో వాళ్లతో మామూలుగా మాట్లాడినా.. ఫ్రెండ్స్‌తో కలిస్తే టిల్లు స్టైల్‌లోనే తెలంగాణ యాస మాట్లాడతా అని చెప్పాడు సిద్ధు. అందుకే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఎలాంటి హోం వర్క్ చేయాల్సిన అవసరం రాలేదు అని చెప్పాడు. ఇక టిల్లు ఎలాంటోడో చెబుతూ… టిల్లుకి ప్రత్యేకంగా లక్ష్యాలేమీ ఉండవు.
పేరుకే డీజే కానీ, వాడిలో అంత టాలెంట్ ఉండదట. రెండు మాస్ పాటలు కొట్టి.. రెండు ఈవెంట్లు చేసుకుని డబ్బులు సంపదిస్తుంటాడు. ఆ డబ్బును చుట్టూ తిరిగే వాళ్లకి బీర్లు పోసుకుంటూ తిరుగుతుంటాడు. అలా ఏ లక్ష్యమూ లేకుండా తిరిగే టిల్లు ఆఖరికి ఎలా మారాడు అనేదే కథ అని చెప్పాడు సిద్ధు. మరి టిల్లు ఏ మాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!