సినిమా, టీవీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన నటుడు ముకుల్ దేవ్(Mukul Dev) … 2 రోజుల క్రితం ఢిల్లీలో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఇండియన్ సినీ ప్రేక్షకులను చాలా బాధ పెట్టింది అని చెప్పాలి. మహేష్ భట్ దర్శకత్వంలో, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ సరసన నటించిన ‘దస్తక్’ సినిమాతో ముకుల్ దేవ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిన సంగతే. కానీ, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే… ‘దస్తక్’ ముకుల్ దేవ్ తొలి సినిమా కాదు.
ముకుల్… అమితాబ్ బచ్చన్ ప్రొడక్షన్ కంపెనీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కార్పొరేషన్ లిమిటెడ్(ABCL) నిర్మించిన ‘నామ్ క్యా హై’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఈ విషయాన్ని ముకుల్ ఓ పాత ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ సినిమా కోసం అమితాబ్ భార్య జయా బచ్చన్ అతనికి రూ.75,000 ఇచ్చారట.
అంతేకాకుండా.. ‘మేము 3 సినిమాలు తీస్తున్నాం, వాటిలో కనీసం ఒకదానిలోనైనా నువ్వు నటిస్తావ్. ఏ సినిమా అనేది ఇంకా ఖరారు కాలేదు, కానీ మాతో కచ్చితంగా ఓ సినిమా చేస్తున్నావ్’ అంటూ జయా బచ్చన్ ముకుల్ తో చెప్పారట. ‘ఆమె కాల్ చేసినప్పుడు ఆశ్చర్యపోయానని, మొదట ఎవరో ప్రాంక్ చేస్తున్నారేమో అని అనుకున్నానని’ కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ‘ఫోన్‌లో మీరు ఎవరు? నాతో జోక్ చేస్తున్నారా?’ అని కూడా ఆమెతో అన్నాడట ముఖుల్.
నిజమే అని తెలిసి ఆశ్చర్యపోయి వెళ్లి ఆమెను కలిశాడట. అయితే, దురదృష్టవశాత్తూ ‘నామ్ క్యా హై’ సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. ‘షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ అమితాబ్ నిర్మాణ సంస్థ ఆ టైంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, నిధుల కొరత కారణంగా ముకుల్ సినిమాతో పాటు పలు సినిమా ఆగిపోయాయి’ అని ముకుల్ తెలపడం జరిగింది.ఒకవేళ ఆ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ముకుల్ లైఫ్ వేరేలా ఉండేదేమో.?