Priyanka Chopra: ప్రియాంక నెక్లెస్ ధర తెలిస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం!

ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈమె సిటాడెల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈమె హాలీవుడ్ పాప్ సింగర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లకు పరిమితమయ్యారు దీంతో బాలీవుడ్ సినిమాల వైపు కనీసం చూడను కూడా లేదు. ఇలా బాలీవుడ్ కి దూరమై హాలీవుడ్ కిపరిమితమైన ప్రియాంక చోప్రా అక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ సందడి చేస్తుంటారు.

అయితే తాజాగా న్యూయార్క్ లో జరిగిన మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహించిన 2023 మెట్ గాలా (Met Gala 2023) ఫ్యాషన్ ఈవెంట్ కు హాజరైంది. ఈ వేడుకలో తన భర్తతో కలిసి ప్రియాంక చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రియాంక ప్రముఖ డిజైనర్ వాలెంటినో డిజైన్ చేసిన స్టైలిష్ బ్లాక్ గౌన్ లో సందడి చేశారు.

అయితే ఈ వేడుక కోసం (Priyanka Chopra) ఈమె ధరించిన నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.అయితే దీని ధర ఎంత ఏంటి అనే విషయాలను తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈమె ధరించిన ఈ నక్లెస్ ధర తెలిస్తే మాత్రం దిమ్మతిరగడం ఖాయమని చెప్పాలి. ఈ వేడుక కోసం ప్రియాంక చోప్రా ధరించిన ఈ నెక్లెస్ బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ను ధరించింది.

ఈ నెక్లెస్ విలువ ఏకంగా రూ.204 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.ఇలా ఈ డైమండ్ నెక్లెస్ ఏకంగా 200 కోట్ల రూపాయలు అనే విషయం తెలియడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈమె నెక్లెస్ ధర మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus