Sharwanand: శర్వానంద్ పెళ్లి కోసం ఒక్క రోజుకు అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా?

  • May 22, 2023 / 04:50 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరి కొద్ది రోజులలో ఓ ఇంటి వాడు కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో ఈయన హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్ రక్షిత రెడ్డి అనే అమ్మాయిని ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఇలా వీరి వివాహం జరిగి ఐదు నెలల అవుతున్న పెళ్లి గురించి ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు.

ఇలా పెళ్లి గురించి ప్రకటించకపోవడంతో శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారంట కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన శర్వానంద్ టీమ్ ఈ వార్తలను ఖండించారు. అయితే తాజాగా ఇరువురి కుటుంబ సభ్యులు శర్వానంద్ రక్షిత వివాహ తేదీని ప్రకటించారు. శర్వానంద రక్షిత జూన్ 2, 3 వ తేదీలో జైపూర్ లోని లీల పాలస్ లో ఎంతో ఘనంగా వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.

ఈ వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నట్టు సమాచారం.ఇక రెండు రోజులపాటు జైపూర్ ప్యాలెస్ లో శర్వానంద్ పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరగబోతున్నాయి.ఇక ఈ పెళ్లి వేడుకల కోసం ఒక్క రోజుకు లీల ప్యాలెస్ లో విడిది ఉండడానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట ఇలా రెండు రోజులకు గానూ శర్వానంద్ పెళ్లికి ఎనిమిది కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

జూన్ రెండవ తేదీ ఉదయం జైపూర్ ప్యాలెస్ కు చేరుకున్న అనంతరం ఉదయం మెహందీ వేడుకలు సాయంత్రం సంగీత్ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఇక మూడవ తేదీ శర్వానంద్ రక్షిత వివాహం ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇరువురు కుటుంబ సభ్యులు పెళ్లి పనులలో నిమగ్నమయ్యారు. ఇక శర్వానంద్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేసుకుని పెళ్లి పనులపై దృష్టి సారించారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus