టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి తమన్న గత కొద్దిరోజులుగా తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి పెద్ద ఎత్తున చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు. ఈ విధంగా తమన్నా ఎక్కడికి వెళ్లినా తన బాయ్ ఫ్రెండ్ తో పాటు కలిసి వెళ్లడంతో తరచూ వీరీ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇక పెళ్లి విషయాల గురించి తమన్న మాట్లాడుతూ ఇప్పుడప్పుడే తనకు పెళ్లి చేసుకొనే ఆలోచనలు కూడా లేవు అంటూ చెప్పకు వచ్చారు ఇక వీరిద్దరూ కూడా లస్ట్ స్టోరీస్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఈ విధంగా ఈ విషయాన్ని తమన్న ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమంలో తెలియజేశారు. ఇలా వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టడంతో అప్పటినుంచి తమన్న తన ప్రియుడు కలిసి బహిరంగంగా జంటగా తిరుగుతూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా వీరిద్దరూ కలిసి ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ క్రమంలోనే తమన్న బ్లూ కలర్ డ్రెస్ ధరించి చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరి దృష్టికి తమన్నా డ్రెస్ పైన పడింది దీంతో తమన్నా వేసుకున్నటువంటి ఆ డ్రెస్ ఖరీదు ఎంత ఏంటని ఆరా తీయడం మొదలుపెట్టారు.
అయితే తమన్నా (Tamannaah) ధరించినటువంటి ఈ బ్లూ కలర్ డ్రెస్ ఇంటర్నేషనల్ బ్రాండ్ LaQuan స్మిత్ డిజైన్ చేసిన మాక్ నెక్ గౌను. ఈ డ్రెస్ ధర $2.550. అంటే భారతీయ కరెన్సీలోకి మారిస్తే..దాదాపు రూ.2,06,399 అని తెలియడంతో నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.